#ప్రశ్న:-

ఆవు హిందువుల ఆరాధ్య దైవం కదా.. మేము (ముస్లిం, క్రైస్తవులు) ఎందుకు ఆవుని చంపకూడదు??
మాకు ఆవు ఆరాధ్య దైవం కాదు.. మేము చంపుకుని తింటాం.. మాకు ఏంటి సంబంధం..?? కొంత అమాయకుల వాదన..

#సమాధానం:-

గోవు హిందువులకు మాత్రమే పవిత్ర మిగతా మతాల వారికి కాదు.. సో మాకేంటి?? ఓహ్..

సరే..

  • ఒక క్రైస్తవుడు కి బైబిల్ అంటే ప్రాణం, ఒక ముస్లిం కి ఖురాన్ అంటే ప్రాణం.. మాములుగా అవి కాగితం మీద ముద్రించినవి అయినా సరే.. ఆయా పుస్తకాల్లో అన్ని పుస్తకాల్లో వాడినట్టే ఇంకు ని, పేపర్ ని వాడతారు.. కొత్తగా ఏమి కనిపెట్టి వాడరు..
  • మరి బైబిల్ ని ఖురాన్ ని నమ్మని వ్యక్తి ఒకడు వచ్చి.. ఆయా పుస్తకాలతో చలికాలంలో చలి మంట అని చెప్పి కొన్ని పేజీలు చింపి మీ ముందే చలి మంట వేసుకుంటే?? చూస్తున్న క్రైస్తవుడు, ముస్లిం ఏం అంటారు..?? అయ్యో పాపం చలి కదా, చలికి వెచ్చదనం కోసం బైబిల్ ఖురాన్ కాల్చుకున్న పర్లేదు?? అని అంటారా?? లేదా థాట్.. మా మత గ్రంధాల్ని, మా దేవుడు చెప్పిన వాక్యాలని నువ్వు చలి మంటకి వాడటం ఏంటి అని అంటారా??

ఆ ముస్లిం, క్రైస్తవుడు ఆ చలి మంటకు వద్దకు వెళ్లి ఎందుకు నువ్వు మా మత గ్రంధాలతో ఇలా చేసావ్ అంటే,  వాడు అంటాడు.. ! నాకు బైబిల్, ఖురాన్ మీద నమ్మకం లేదు.. నేను ఒక వేరే మతస్తుడిని.. లేదా నాస్తికుడిని అని అన్నాడనుకోండి.. మీకు కాలుతుందా?? లేదా?? వాడు అంటాడు, నా సొంత డబ్బులతో బైబిల్, ఖురాన్ కొనుక్కున్నాను.. అవసరమైతే కాలుస్తా… లేదంటే చింపుతా మీకేంటి మధ్యలో అని అంటే.. మీరు ఎలా ఫీల్ అవుతారు?? మీ బోడి నమ్మకాలూ ఎవడికి కావలి.. అని అంటే మీకు బాధ కలగదా??

అలాగే హిందువుల ఆరాధ్య దైవం అయిన గోవు ని మీరు పూజించకపోయిన హిందువుల నమ్మకాలను గౌరవించాలి..

ఒక ముస్లిం లు నివసిస్తున్న ప్రాంతంలోకి వెల్లి పంది మాంసం వ్యాపారం చెయ్యండి చూద్దాం.. వాళ్లకి ఖురాన్ లో పందులను తినొద్దు అని ఆజ్ఞ ఉంది కాబట్టి తినరు.. హిందువుల గ్రంధాల్లో ఆవుని పూజించండి అని ఉంది కాబట్టి మేము పూజించుకుంటాం అని అంటే.. మా మీద మత ఉన్మాదులు అని ముద్ర వేస్తున్నారు..

మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో ఇక్కడ 70% పైగా హిందూవులు ఉంటె.. మెజారిటీగా హిందూవులు ఉంటె వారి నమ్మకాలూ ఎందుకు గౌరవించరు మీరు?? అంటే మీ నమ్మకాలను మాత్రం అందరు గౌరవించాలి, మెజారిటీ హిందువుల నమ్మకాలూ గౌరవించారా??
మీకో న్యాయం, పక్కవారికి ఒక న్యాయం..??

మనం భరత మాత ముద్దు బిడ్డలం…
కలిసిమెలిసి ఉందాం…
ఒకరి నమ్మకాలు ఒకరు గౌరవిద్దాం..