ఈ భూమి మీద జీవులు ఎన్ని ఉన్నాయి?? :-
======================

మనలో చాలా మంది కి మన హిందూ గ్రంధాల గొప్పతనం తెలియదు.. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా హిందూ గ్రంధాలు అంటే అంటే ఏవో కట్టు కధలని ఒక అపోహ.. అలాంటి వాళ్ళ కోసమే ఈ వ్యాసం..

కార్ల్ లిన్నేయస్ అనే శాస్త్రవేత్త (స్వీడన్) ఒక 300 సంవత్సరాల క్రితం పుట్టి జీవుల వర్గీకరణ మీద పరిశోధనలు చేసాడు.. భూమి మీద జీవులు ఎన్ని ఉన్నాయి, వాటి జీవులను వర్గీకరించడం వాళ్ళ ప్రపంచం అతన్ని వర్గీకరణ కి ఆద్యుడు అని పిలిచింది..

కానీ ఎన్నో వేల, లక్షల సంవత్సరాలు క్రితమే భారతీయ హిందూ గ్రంధాలూ ఈ భూమి మీద ఎన్ని రకాల జీవరాసులు ఉన్నాయి, వాటి ని విభజించి, వర్గీకరించి వివరించడం జరిగింది..

హిందువుల గ్రంధాల ప్రకారం పునర్ జన్మ ని విశ్వసిస్తారు.. మనం చేసిన పాప పుణ్యము బట్టి మనకి 84 లక్షల జీవ రాశులలో ఎదో ఒక జన్మ వస్తుంది.. లేదా మనం ఆ పరమాత్మా తత్వాన్ని ఎరిగితే ఈ జన్మ లోనే మోక్షం సంపాదించి ఆ పరమాత్మ ను చేరుకోవచ్చు.. మంచి పనులు చేసి ఉత్తమ జన్మలు అంటే దేవతలు లాగా స్వర్గం పొందొచ్చు, పాప కార్యాలు చేసి హీనమైన జన్మల లోకి జారిపోవచ్చు.. ఇలా ఒక ఒక జీవుడు 84 లక్షల జీవరాసుల జన్మచక్రం లో పడి తిరుగుతాడు..

ఈ 84 లక్షల జీవరాసుల అనేదాంట్లో ఆధ్యాతికమ్ తో పాటు బోలెడంత సైన్స్ కూడా దాగి ఉంది..

ఈ భూమి మీద జీవులు ఎన్ని ??
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ఈ ప్రశ్న చాల మందికి వచ్చే వుండే ఉంటుంది.. ఈ భూమి మీద ఉన్న జీవులు ఎన్ని ఉన్నాయో తెలియాలంటే ఒక్క సారి మన భారతీయ హిందూ గ్రంధాలను తిరగేయాలి.. వేదాల ప్రకారం ఈ భూమి మీద 84 లక్షల జీవరాసులు ఉన్నాయి.. 84 లక్షలు అంటే 84 లక్షల రకాలు జీవ రాసులు అని.. ఈనాటి భాషలో చెప్పాలంటే లక్షల జాతులు అని అర్ధం..

అష్టా దశ పురాణాలు ఒకటి అయినా విష్ణు పురాణం, గరుడ పురాణం లో జీవులు ఎన్ని?? అవి ఎన్ని రకాలు వాటి మీద స్పష్ట మైన వివరణ ఉంది..

జలజ నవ లక్షణి  (జల చరాలు – 9,00,000)
స్థావర లక్ష -వింశతి (కదలనవి – 20,00,000)
క్రిమయో రుద్రా -సంఖ్యకః (సూక్ష్మ జీవులు – 11,00,000)
పక్షిణం దశ -లక్షణం (పక్షులు – 10,00,000)
త్రింశల్ -లక్షాని పశవః  (పశువులు – 3,00,000)
చతుర్ లక్షాని మానవః  (మనుషులు – 4,00,000)

గరుడ పురాణం ప్రేత కల్ప 12 వ అధ్యాయం, 2 శ్లోకం

అండజమ్ – 21,00,000 (గుడ్డు నుండి పుట్టేవి)
స్వేదజమ్ – 21,00,000 (నీటి చెమ్మ నుండి పుట్టేవి)
ఉద్భుజం – 21,00,000 (భూమిని చీల్చుకుంటూ పుట్టేవి)
జరాయుజం – 21,00,000 (మావి చేత కప్పబడి పుట్టేవి)

సైన్స్ ఏమి చెప్తుంది??

బ్రిటన్ లో 2011 లో జరిగిన పరిశోధన లో ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉన్న జాతులు సంఖ్యా 87 లక్షలు అని తేలింది. ఈ సంఖ్యా మన గ్రంధాలలో చెప్పబడిన సంఖ్యా కి చాలా దగ్గరగా ఉండటం విశేషం.. పరిశోధన ప్రకారం ఈ భూమి జీవులు 87 లక్షలు పైనే ఉన్నాయి, వాటిలో ఏ ఏ జీవులు ఎన్నిన్ని ఉన్నాయో కూడా వివరించింది..

Animals – 7.77 million
Fungi – 0.61 million
Plants – 0.30 million
Protozoa – 0.04 million
Chromists – 0.03 million

ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎన్నో వ్యయ ప్రయాసలు పడి జీవులు 87 లక్షల రకాలు అని 2011 లో చెపితే మన సనాతన హిందూ గ్రంధాలు ఎప్పుడో జీవులు 84 లక్షల రకాలు అని వివరించాయి.

2011 లో జీవులు 87 లక్షల అని వివరించిన సరే.. నిజానికి ఈ భూ గ్రహం మీద జీవరాసులు వేల కోట్లు ఉన్నట్టు ఒక అంచనా.

నిజానికి కొత్త జాతులు, కొత్త జీవులు ఈ భూమి మీద ఆవిర్భవస్తూనే ఉంటాయి.. ఎందుకంటే జీవ పరిణాక్రమం, ఆవిర్భావమ్ అనేవి నిరంతర ప్రక్రియలు.. మొత్తం ఈ భూమి మీద ఉన్న జీవ జాతులు ఎన్నో కోట్ల సంఖ్య లో ఉండి ఉంటాయి..

కానీ ఎన్ని కోట్ల జాతులు, కొత్త జంతువులూ వచ్చిన సరే.. భూమి మీద ఉన్న జాతుల సంఖ్య మారదు, జీవులు సంఖ్య మారదు.. ఎలా అంటే

ప్రాధమిక శక్తి, ద్రవ్యరాశి సూత్రం ప్రకారం మనం శక్తి ని, ద్రవ్యరాశిని సృష్టించలేం.. నాశనం చేయలేం.. అది ఒక రుపం లోనుండి వేరొక రూపం లోకి మారుతుంది..

Energy can neither be created nor destroyed; rather, it transforms from one form to another.

అలాగే ఈ భూమి మీద జీవులలో ఉండే ద్రవ్యరాశి, శక్తి అనేవి.. కొత్తగా వచ్చిన జీవులచేత మార్చబడవు.. అవి నిరంతర శాశ్వతాలు.. మనకి భౌతికంగా జీవుల సంఖ్య పెరిగినట్టు, ద్రవ్యరాశి పెరిగినట్టు కనిపిస్తుంది

ఈ విశ్వాన్ని ఒక వేదిక గా తీసుకుంటే ఈ విశ్వం ప్రారంభము లో ఉన్న శక్తి ద్రవ్య రాశి అనేవి శాశ్వతములు, వాటి పరిమాణంలో ఎలాంటి మార్పు లేదు.. శక్తి, ద్రవ్య రాశి అనేవి ఒక రూపం లో నుండి వేరో రూపం లోకి మారుతాయి తప్ప వాటి పరిమాణం లో ఎలాంటి మార్పు లేదు..

ఈ శక్తి సూత్రాన్ని మనం లలిత సహస్ర నామ లో చుస్తే అజ, అక్షయ, లీల విగ్రహ ధారిణి అనే మూడు పేర్లలో చూడవచ్చు.. అజ అంటే జన్మించనిది (సృస్టించనది) అక్షయ (నాశనం లేనిది) లీల విగ్రహ ధారిణి (అనేక రూపాలు ధరించినది). ఈ మూడు పేర్లతో ప్రాధమిక శక్తి సూత్రాన్ని మన ఋషులు అందించారు..

ఇది ఆంతా ఎందుకు చెప్పవలిసి వచ్చింది అంటే ఈ భూమి మీద ఉన్న జీవుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నప్పటికీ, పెరుగుతున్నట్టు మనకి భౌతికంగా అనిపించినప్పటికీ అది అంత శక్తి, ద్రవ్య రాశి తన రూపాలు మార్చుకోవటమే కానీ వేరొకటి కాదు..

మిగతా మత గ్రంధాలూ లలో లేని జీవుల వర్గీకరణ, జీవ జాతుల సంఖ్య గూర్చి వివరణ హిందూ గ్రంధాలూ ఎప్పుడో ప్రపంచానికి అందించాయి.

ఈ విశ్వం ప్రారంభం లో ఏది అయితే శక్తి ఉన్నదే అదే పరమాత్మ.. ఆ పరమాత్మ లోనుండి వచ్చినవే ఈ సమస్త విశ్వం.. ఆ పరమాత్మా యే తన శక్తి ని వివిధ రూపాల్లో మార్చుకుని అండం మొదలుకుని పిండం నుండి ఈ బ్రహ్మాండం దాకా విస్తరించబడి ఉంది..

http://journals.plos.org/plosbiology/article…