ఈ క్రైస్తవ మత ప్రచారుకులకీ బుర్ర బుద్ధి, సిగ్గు లజ్జ చీము నెత్తురు ఏమైనా ఉన్నాయా?? ఎందుకో లేవు అనిపిస్తుంది.. వీళ్ళ మత ప్రచారానికి, అమాయకులను మోసం చేయడానికి ఎంత నిచానికైనా దిగజరుతారు..

ఇటీవల కొన్ని వాహనాల మీద, చర్చి లోనా

1. యేసు ని నమ్ముకుంటే మోక్షం వస్తుంది అని
2. ఓం కారమే క్రీస్తు ఆయెను అని

అని వివేకనందుడు చెప్పినట్టుగా కొంత మంది విదేశాలకు అమ్ముడు పోయిన క్రైస్తవ మత మార్పిడి మాఫియా లు ప్రచారం చేస్తున్నాయి..
వాటి మీద అందరికి అవగాహనా కోసం ఈ పోస్ట్..

1. యేసు ని నమ్ముకుంటే మోక్షం వస్తుందా??

(మొదటి ఫోటో, రెండో ఫోటోలో పుస్తకం పేరు జ్ఞాన దీపము అని పెట్టేసి పేజీ నంబర్ మార్చేశారు)
అసలు మోక్షము అంటే ఏమిటి? ఆ మాట అనటానికి క్రైస్తవులు కు అర్హత ఉందా?? మోక్షం అంటే మనం చేసిన పాపం పుణ్యాల బట్టి రకాల రకాల జన్మలు ఎత్తుతూ చివరికి ఆ పరమేశ్వరున్ని ఎరిగి ఆయనలో ఐక్యమ్ అవ్వడం మోక్షం..

కాసేపు వివేకానంద ఆ మాట అన్నాడే అనుకుందాం.. అంటే క్రైస్తవులు, బైబిల్ పునర్ జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నారా?? అలా అయితే వివేకానంద చెప్పకపోయినా చెప్పిన్నట్లు మీరు క్రియేట్ చేసిన ఈ వాక్యాలు చెల్లుతాయి..
బైబిల్ లో మోక్షం అనే పదమ్ ఉందా?? ఉంటె చూపియండి!!

వివేకానంద ఏమన్నాడో యేసు గూర్చి, దేవుడు గూర్చి, అసలు ఎవర్ని పూజించాలి.. అయన మాటల్లోనే విందాం..

👉 “యేసు జన్మించకుంటే, మానవకోటికి తరుణోపాయం ఉండేదికాదని తలంచడం ఘోరపాపం. క్రీస్తులూ, బుద్దులూ ఆత్మసాగరంలోని వీచికలు. నీలోని పరమాత్మకు తప్ప దేనికీ ప్రణమిల్లకు. నువ్వే ఆ దేవదేవుడినని గ్రహించే వరకు నీకు ముక్తిలేదు” (ఉత్తేజిత ప్రసంగాలు, 118) (మొదటి ఫోటో) — ఇవి వివేకనందుడు చెప్పిన మాటలు
వీళ్లు ఏమో వీళ్లకి నచ్చినట్టుగా వివేకానందుడు పేరు వాడుతున్నారు..

వీళ్లకసలు మనస్సాక్షి ఉంటే తాము మనుషులమే అనే స్పృహ ఇంకా మిగిలి ఉంటే వివేకానంద యేసు గురించి చెప్పిన మరి కొన్ని విషయాలని కూడా వీరు అంగీకరించాలి… అవి చూద్దాం..

👉 స్వీయధర్మాన్ని పూర్తిగా ఆచరించని కారణంగానూ, అన్నింటికంటే, స్త్రీకి పురుషునితో సమాన ప్రతిపత్తినివ్వని కారణంగానూ ఏసు అపరిపూర్ణుడు. స్త్రీలే అతనికి సర్వం ఒనర్చారు. అయినా ఒక్క స్త్రీనైనా అతడు శిష్యురాలిగా స్వీకరించలేదు. యూదుల ఆచారానికి అంతగా కట్టుబడ్డాడు. అతని కంటె బుద్దుడు కొంత మేలు. స్త్రీని బుద్దుడు పురుషునితో తుల్యాధికారిణిగా అంగీకరించాడు. అయినా అతడూ అపరిపూర్ణుడే (వివేకానంద సాహిత్య సర్వస్వం: దివ్యవాణి- బుద్దులు,క్రీస్తులు. పేజి నం.499)

👉 ఒక మానవుడు అతడెంత మహనీయుడైనా అవుగాక! మనం అతణ్ణే నమ్ముకుని ఉండకూడదు. మనం కూడా బుద్ధులం, క్రీస్తులం కావాలి. క్రీస్తు మానవుడే, బుద్దునికంటే కొంచెం తక్కువవాడు. అతణ్ణీ నమ్ముకోడం సరికాదు. (పే. 478)

👉 జీసెస్‌ క్రీస్తు, మహమ్మదు లాటి మహా పురుషులైనా సరే, అనేక మూఢభావాలను వారు విశ్వసించారు. వాటిని త్యజించలేకపోయారు. కానీ మీ దృష్టిని సర్వదా సత్యం మీదే కేంద్రీకరించాలి. సకల మూఢనమ్మకాలను పూర్తిగా పరిత్యజించాలి.

👉 క్రీస్తు ప్రవచనాలన్నీ తూర్పు దేశానికి చెందినవే. భారతదేశం నుండి ఏసు అరువు తెచ్చుకున్నవే ననిదానర్ధం.

క్రైస్తవులుకీ వివేకానందుడు చెప్పిన మాటలు ప్రమాణికం కాబట్టి అయన చెప్పినట్టు

యేసు మూఢ నమ్మకాలు ఫాలో అయ్యాడు అని,
యేసు కంటే బుద్ధుడు బెట్టర్ అని,
యేసు కి స్త్రీలు అంటే చిన్న చూపు అని,
మనిషి అన్నవాడు ఎవడు మనలో ఉన్న పరమాత్మా కి తప్ప దేనికి ప్రణమిళ్లకుడదు అని నమ్మాలి..

రేపు ఎవడో వచ్చి వివేకానంద మేడలో సిలువ వేసి అయన బాప్టిజం కూడా తీసుకున్నారు అని కూడా అంటారు..

2. ఓం కారమే క్రీస్తు ఆయెను (2,3,4 ఫోటోలు)

అసలు స్వామి ఈ మాట ఎక్కడ చెప్పారో రెఫరెన్స్ ఇవ్వమంటే చాలు ఈ క్రైస్తవ జంబూకాలు చాలావరకు జారుకుంటాయి.ఇక కొంతమంది ‘ప్రభోధరత్నాకరం’ అనే పుస్తకం లో ఉంది అంటారు.

1895 జూన్‌లో వివేకానంద, సహస్రద్వీపవనం (థౌజండ్‌ ఐలండ్‌పార్కు) లో తన శిష్య బృందానికి జూన్‌ 19 నుండి ఏడు వారాలపాటు ప్రతిరోజూ పాఠాలు చెప్పారు. 19వ నాడు అందరూ హాజరుకాలేదు. అయినా సమయం మించిపోతుండడంతో, అప్పటికి ఉన్న నలుగురం క్రైస్తవులమవడంతో బైబిలు తెచ్చి దానిలోని యోహాను సువార్తను తెరిచి దానిలోని మొదటి వాక్యాలను చదివి వివరించడం మొదలెట్టారు..

ఆదిలో ‘శబ్దం’, అది దేవుడి వద్ద ఉండినది శబ్దమే దేవుడు ఇది (శబ్దం) బ్రహ్మశక్తి కాబట్టి హైందవులు దీనిని బ్రహ్మ స్వరూపమనీ అనీ చెపుతారు.

👉 ఈ బ్రహ్మశక్తి రెండు రీతుల్లో వ్యక్తమౌతుంది. ఒకటి సాధారణ ప్రకృతి రూపంలోనూ… రెండు కృష్ణుడు, బుద్దుడు, క్రీస్తు, రామ కృష్ణుడు మొదలైన అవతార మూర్తుల రూపంలోనూ వ్యక్తమౌతుంది..ఇది స్వామి వివేకానంద చెప్పిన అసలు విషయం.

ఇది చదివిన తలకాయ ఉన్నవాడెవడైనా ఓం కారమే క్రీస్తు ఆయను అని వివేకానంద అన్నాడని అనగలడా?!

ఇందులో అసలు ఓంకారం ప్రస్తావనే లేదు.. వివేకానంద అద్వైత సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ప్రచారం చేసేవారు. అందువల్ల ఈ సృష్టి అంతా బ్రహ్మమే అని ఆయన ఉద్దేశ్యం

ఆ అవతారమూర్తుల సంఖ్యకి పరిమితి లేదు.. తన గురువు రామకృష్ణ పరమహంస కూడా అవతారమూర్తి అని చెప్పారు..

క్రైస్తవులుగా ఉండి తన శిష్యులుగ మారడానికి సిద్దపడి తన ప్రసంగాలు వినడానికి వచ్చిన ముగ్గురు నలుగురు క్రైస్తవులతో, బ్రహ్మతత్వాన్ని గురించి మాత్రమే. ఆయన ప్రసంగ సారాంశం బ్రహ్మం ప్రకృతి రూపంలోనూ, విశిష్ట వ్యక్తుల రూపంలోనూ రెండుగా వ్యక్తమవుతూ ఉంది.

మనం బ్రహ్మమే. మనమే బ్రహ్మం అని చెప్పాలన్నదే వివేకానందుని ఉద్దేశం.

ఏసు మనిషే ఇక పోతే హైందవ అద్వైతసిద్దాంతం ప్రకారం ఏసూ బ్రహ్మమే, బుద్దుడూ బ్రహ్మమే, రామకృష్ణుడూ బ్రహ్మమే. మనమూ బ్రహ్మమేనన్నదే ఆ ప్రసంగ సారాంశం. దీనిని క్రైస్తవులు ఒప్పుకుంటారా???

ఏసు అపరిపూర్ణుడు, అనేక మూఢవిశ్వాసాలూ కలిగి ఉన్నవాడు. అతడే రక్షకుడు అనడం మహాపరాధం అని స్వామిజి చెప్పిన మాటలు మీకు సమ్మతమేనా??

బ్రహ్మనంద సాగరంలో ఏసులాంటివాళ్ళు వీచికలు (చిన్న తెప్ప) వంటి వాళ్ళు మాత్రమే…. మనమే అసలు బ్రహ్మస్వరూపులం మనం లేకుంటే వాళ్ళంతా మృతప్రాయులే…

అది అసలు సంగతి…మరి
రండి క్రైస్తవ సోదరులారా…

మీ దొంగ భోదకుల కల్లబొల్లి మాటలు పక్కనబెట్టి స్వామి వివేకానంద చెప్పిన ‘అద్వైతమార్గం’ లో పరబ్రహ్మన్ని అన్వేషిద్దాం… చర్చి కి వెళ్లి మేము పాపులం, మేము పాపులం అనే మనసు చంపుకోకుండా.. మనలో పరమాత్మా వున్నాడు అన్న సత్యం లోకి రండి..

వివేకానంద,గాంధి,వేదాలు,భవిష్యపురాణం పేరుతో క్రైస్తవాన్ని ప్రచారం చెయ్యడం క్రైస్తవులు మొదలుపెట్టారు …నా యొక్క ఇన్నాళ్ళ అనుభవవములో ఏ ఒక్క క్రైస్తవుడు వారి మతానికి పెద్ద దిక్కు అయిన పొప్ ఫోటోని పెట్టిగాని,బిషప్ ఫోటోని పెట్టిగాని క్రైస్తవం ప్రచారం చెయ్యడం ఒక్కసారి కూడా చూడలేదు ..

పొప్ మీద నమ్మకం లేకనా …?

వాటికన్ లో చిన్న [పిల్లలపై జరిగిన ఆకృత్యాల చేత వారి ఫోటోలు పెట్టడానికి సంశయిస్తున్నారా..?

హిందూ గురువులు చెప్తే గాని మీ యేసు గొప్పవాడు కాలేడా…? అంత గౌరవం హిందు గురువుల మీద ఉంటె వారు చెప్పిన వేద వాంగ్మయాలు నమ్మోచ్చుగా…?

క్రైస్తవులలో ఫోటో పెట్టి వాక్యాలు రాసేంత మగాళ్ళు లేరా..?

హిందువుల పేర్లు , వారి గ్రందాల పేర్లు చెప్పుకొని అస్తిత్వం లేని క్రైస్తవాన్ని బ్రతికించుకుందాం అనుకుంటున్నారా..?

గాంధిజీ యేసు ని నమ్మినవాడే అయితే ” రామ రాజ్యం కావాలి ” అని ఎందుకు అన్నాడు…? యేసు రాజ్యం ఎందుకు అడగలేదు..? యేసు మీద అంత ఎక్కువ నమ్మకమా..?
వివేకానంద నిజం గా క్రైస్తవుడే అయితే చికాగో లో చేసిన చారిత్రాత్మిక ప్రసంగం లో యేసు గూర్చి ఒక్క క్షణం కూడా చెప్పలేదు ఎందుకని..?
నిజముగా వివేకానంద యేసుని అంగీకరిస్తే భారతదేశాన్ని తన పలు ప్రసంగాలలో వేద భూమిగా అభివర్ణించాడు గాని బైబిల్ నేలగా కాదు …! అంటే బైబిల్ మీద యేసు మీద నమ్మకం లేనట్టే గా…?
క్రైస్తవానికి అస్తిత్వం హిందు గురువుల పేరు తో రాసిన వక్ర భాష్యాల చేతనే సాధ్యమని అనుకుంటున్నారా..?

Source: vivekapatham, Karunakar Sugguna