ప్రతి భారతీయుడు ఈ దేశం గురించి గర్వించదగ్గ విషయాలు దేనిని ఆధారం చేసుకుని ఉన్నాయి? గణితశాస్త్రంలో ఆర్యభట్టు, వైమానిక శాస్త్రంలో భరద్వాజుడు(ఏరొనాటిక్స్), ఖగోళశాస్త్రంలో వరాహమిహీరుడు, ఆర్థికశాస్త్రంలో చాణక్యుడు, మనిషి యొక్క మాటకి సమబంధించిన శాస్త్రం (వ్యాకరణం) లో పాణిని, పతంజలి(ఆయుర్వేదం, యోగశాస్త్రం కూడా అందించిన వ్యక్తి)), ఇలా చెపుతూ పోతే ఉన్నత శిఖరాలకు చేరుకున్న మన భారతీయ నాగరికత ఇప్పటి యువతరం యొక్క బుద్ధిలో కొన్ని ప్రశ్నలు పుట్టించాలి.

వేదములు అపౌరుషేయములు(not created by Human beings) అని చెబితే శంకించేవాళ్ళూ ఉన్నారు. వేదాలని సునిశితంగా పరిశీలించినవారు వాటిని అసలు మానవుడైన వాడు తయారు చేయడం అసాధ్యం అని తేల్చి చెప్పారు. ఋషులకు ధ్యానసమాధిస్థితిలో వినపడినదానిని శిష్యులకి అందిస్తూవచ్చి ఆ యొక్క పరంపర కొనసాగి వేదవిద్య విస్తరించింది. వేదములు అనంతం అని చెప్తారు, “అనంతావై వేదాహ్” అని. మానవుడికి ప్రకృతిపర్యావరణములకి హాని కలిగించకుండా సిస్టమాటిక్ గా బతకడానికి ఇచ్చిన టెక్నాలజీయే వేదం అంటే.

పరాయిపాలన మొదలైన తరువాతే మనం అభివృద్ధి సాధించామా? మన దేశ చరిత్రని వక్రీకరించి పుస్తకాలు వ్రాసిన పాశ్చాత్యులు చెప్పిందే నిజం అని మనల్ని బలవంతంగా నమ్మించిన శక్తి ఏమిటి? అసలు ఒక దేశం అభివృద్ధి చెందటం అంటే ఏమిటి? ఇటువంటి చాలా ప్రశ్నలకి జవాబు స్వయంగా పరిశోధించి ఇప్పటి యువత తెలుసుకోవాలి. దేశం అంటె మట్టి కాదు మనుషులు అన్న జ్ఞానం ఉంటే ఈ అబ్రహం మతస్తులు హిందువుల పట్ల కృతజ్ఞతతో వ్యవహరించాలి. “నాకు నా దేశం అంటే ప్రాణం, అమితమైన ప్రేమ” అని ఏం చూసి చెప్పుకోవాలి? హిందువులు కానివారికి(అబ్రహం మతస్తులు) భారతీయపౌరులైనప్పటికీ మన భరతఖండం అంటే దేశభక్తి అసలు ఎందుకు కలిగి ఉండాలి? ఈ ప్రశ్న తలెత్తడానికి కారణం అబ్రహం మతస్తులు ఈ దేశం యొక్క సహజసిద్ధమైన వైదిక శాస్త్ర జ్ఞానాన్ని ధిక్కరిస్తూ మతోన్మాదంతో ఈ దేశం యొక్క పౌర,రాజ్యాంగహక్కుల్ని వాడుకుంటూ మతమార్పిడులు చెస్తున్న వైనమే వీరికి ఈ దేశాన్ని రాజకీయంగా ముక్కలు చేయాలని ఉంది అని నిరూపిస్తుంది .

పాశ్చాత్యుల పద్ధతిలో బడి చదువులు, ఉన్నత శ్రేణి కాలేజి చదువులు మొదలైనప్పట్టినుంచి మన సనాతన ధర్మం ఇంకా కృశించింది. పరాయిపాలనలో, విభజించు-పాలించు అనే కుట్ర లో భాగంగా మన హిందువుల సంస్కృతినీ, పరిపూర్ణంగా హిందూ ధర్మం యొక్క పటుత్వాన్ని దెబ్బతీసి, మనలో మనకే విభేదాలు కల్పించిన వారిచే తయారు చేయబడిన చరిత్రని దశబ్దాలుగా చిన్నప్పటినుంచీ పాఠ్యాంశాలలో చేర్చి చదివించి వాస్తవిక భారతీయ చరిత్ర ఇదిగో ఈ విధంగా ఉంటుంది అని తెలియని విషయాలు చెపితే నమ్మని స్థితిలో ఇప్పటి యువత ఉంది.

హిందూ అస్తిత్వాన్ని రక్షించుకోవాలంటే చేయాల్సిన పనులలో అతిముఖ్యమైనది భాష యొక్క సమ్రక్షణ. ఒక జాతి ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోడానికి తన భాషలో ఎంత లోతు ఉన్నది అన్న విషయం ప్రాముఖ్యత వహిస్తుంది. భూమి మీద మరే భాషకీ లేని వ్యాకరణం సంస్కృత భాషకి ఉంది. అంటే అర్థం సంస్కృతం సమగ్రమైన, పరిపూర్ణత చెందిన, పరిపక్వత కలిగిన, పరిణతి చెందిన భాష అని నిస్సందేహంగా ఋజువవుతోంది. ఇటువంటి వాస్తవాలని కూడా ఒప్పుకోనివాడు పక్షపాతబుద్ధి కలిగినవాడు అని రుజువు అవుతుంది. ఈ దేశంలో మెజారిటీ ప్రజలకి సంస్కృతం ఇంగ్లీషు వచ్చినట్టు వస్తే అప్పుడు మన అసలు ధర్మాన్ని పునరుద్ధరించుకోడానికి పునాదులు ఏర్పడతాయి. ప్రజల్లో చొచ్చుకుపోయిన ఇంగ్లీషు యొక్క ప్రవేశం సంస్కృతం కనుక సాధిస్తే అప్పుడుగాని ఒక రంగం సిద్ధం కాదు. ప్రస్తుతపరిస్థితులనిబట్టి ఇది అతిశయోక్తిగా కనపడుతుంది. కనీసం ఇప్పుడైనా మేలుకుని రాబోయే తరం వాళ్ళని సంస్కృతంలో ప్రవేశం సాధించేవిధంగా వారి పెంపకం అనేది సాధ్యపడితే అప్పుడు ఆ “అతిశయోక్తి” అసాధ్యం కాదు.

శ్రీ సుగ్గున కరుణాకర్ లాంటి వారు యువత కి ఆదర్శం కావాలి, ఎందుకంటే వారు పక్షపాతబుద్ధి చూపకుండా స్వతహాగా పూనుకొని స్వయంగా పరిశోధించి జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ప్రజలని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. భూమి మీద ఏ సంస్కృతి కి లేని ఒక సనాతనమైన గురుపరంపర కలిగిన, మహర్షులు, బ్రహ్మర్షులు జన్మించిన ఈ సనాతన ధర్మంలో పుట్టినందుకు గర్విస్తూ, చైతన్యవంతులై సనాతన ధర్మం పాలిటి ప్రతికూలశక్తులని జ్ఞానం అనే అగ్నితో దహించగలిగే శక్తిని యువతకి ప్రసాదించమని ఈశ్వరుడిని కోరుతూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. Please go through the below weblinks for your information.

The Secret Behind CERN Research Institute Having Shiva’s Tandava Statue

BBC Accepts that the Aryan Invasion theory is flawed

http://timesofindia.indiatimes.com/india/Aryan-Dravidian-divide-a-myth-Study/articleshow/5053274.cms