మనం మరిచిపోయిన మహానుభావుడు !
============×××××=============

పేరు: ఎల్లాప్రగడ సుబ్బారావు
ఊరు: భీమవరం, ఆంద్రప్రదేశ్
పుట్టినరోజు: జనవరి 12, 1895
వృత్తి: Biochemist (జీవరసాయన శాస్త్రవేత్త)

ఈయన గూర్చి మనం ఏమి తెలుసుకోవాలి?
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼–

ఒక మాములు మధ్యతరగతి కుటుంబం లో జన్మించిన ఓ వైద్య శాస్త్ర అద్భుతం !
Miracle man of medicine అని పిలిపించుకున్నాడు !

నోబెల్ బహుమతి గ్రహీత GH Hitchings ఎల్లాప్రగడ గూర్చి మాట్లాడతూ ఇలా అన్నారు ” మేము కనిపెట్టిన చాలా న్యూక్లియోటైడ్స్ ఇంతకు ముందే ఎల్లాప్రగడ సుబ్బారావు కనిపెట్టేశారు… దానినే మేము మళ్ళీ కనిపెట్టాము.. సుబ్బారావు తో పనిచేసిన ఆతని సాటి శాస్త్రవేత్తల అసూయ, ద్వేషం కారణంగా సుబ్బారావు చాలా ఆవిష్కరణలు ప్రపంచానికి తెలీదు !!

ఆయన జీవితం :
౼౼౼౼౼౼౼౼౼-

జనవరి 12, 1895 న భీమవరం లో పుట్టారు. స్కూల్ చదువులు రాజమండ్రి లో పూర్తి చేసుకుని, మద్రాస్ లో ఇంటర్ పూర్తి చేసి మద్రాస్ మెడికల్ కాలేజ్ లో LMS డిగ్రీ సంపాదించారు! ఎల్లాప్రగడ వారికి ఆయుర్వేదమ్ పైన ఉన్న మక్కువ చేత, ఆయుర్వేదం ని ఆధునిక పద్ధతుల్లో బాగా వాడొచ్చని మద్రాస్ ఆయుర్వేద కాలేజ్ లో టీచర్ గా జాయిన్ అయ్యారు !

ఆయుర్వేదాన్ని సాటి భారతీయులే హేళన చేస్తున్న ఆ రోజుల్లో ఎల్లాప్రగడకి అమెరికా నుండి పిలుపు వచ్చింది ! అమెరికా లో Harvard university లో PhD కూడా పూర్తిచేసి, ledral company తో కలిసి పనిచేసారు !

ఎల్లాప్రగడ ఆవిష్కరణలు (కొన్ని)
===========×××=============

* ఫాలీక్ ఆసిడ్ తయారీ (రక్తహీనతకి మందు)
* మిటోట్రెకసెట్ (కాన్సర్ కి మందు)
* టెట్రా సైక్లిన్ (ప్లేగు, మలేరియా, కలరా etc కి మందు
* అరియొమైసిన్ (పెన్సిలిన్, స్టెప్ట్రోమైసిన్ కంటే బాగా పనిచేసే antibiotics)
* రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికాకి వైద్య సేవలు
* మనిషి లో శక్తికి మూలం ATP
* Polymyxin ( పశువుల మేత)
* విటమిన్ B9 తయారీ

ఇలా ఎన్నో గొప్పగొప్ప విషయాలు ఆయన కనిపెట్టిన సరే, ఆయనికి ఎలాంటి గుర్తింపు రాలేదు.. నోబెల్ బహుమతి గాని, భారతరత్న గాని లేదు ! ఎందుకంటే ఆయన ఏదో ఆశించి ఇవన్నీ కనిపెట్టలేదు ! ప్రపంచ క్షేమం కోసం కనిపెట్టారు !

కానీ అతని తోటి శాస్త్రవేత్తలు, అక్కడి అమెరికన్లు భారతీయిడికి ఇంత పేరు, ప్రతిష్ట రాకూడదు అని అతని పరిశోధనలని వాళ్ళ పరిశోదనలుగా చెప్పుకున్నారు ! ఆఖరికి మన చరిత్రలో, మన పాఠ్యపుస్తకాలలో కూడా ఆ మహానుభావుడు కి చోటు లేదు !
ఎల్లాప్రగడా గూర్చి doron K Antrim అనే రచయిత ఇలా అంది ” “Yet because he lived you may live longer”.

ఎల్లాప్రగడ జీవితంలో జరిగిన ఓ సంఘటన !
====================================

స్థలం: చెన్నై, మైలాపూర్, కపాలీశ్వర దేవాలయం
సమయం: 1922 సంవత్సరం, ఒక సాయంకాలం

దేవాలయం కోనేటి మెట్లపై ఓ ఐదారుగురు మిత్రులు కబుర్లాడుతున్నారు. వారంలో ఒకసారి అలా కలుసుకోవడం ఆనవాయితీ. ఆ గుంపులో మెడిసిన్ లో డిప్లమా తీసుకొని, చెన్నై ఆయుర్వేద కళాశాలలో పనిచేస్తున్న ఒక డాక్టరూ ఉన్నాడు.

ఆయన నెల జీతం అరవై రూపాయలు.
డాక్టర్ : నాకేగనక ఓ పదివేలరూపాయలుంటే నా పరిశోధనలతో అద్భుతాలు చేసి చూపిస్తాను.

ఒకశ్రోత : సర్లేవయ్యా! నీ సోది ఎప్పుడూ ఉండేదేగదా!

డా: నిజం సర్, నామాట నమ్మండి. పెట్టుబడే ఉంటే, “సర్పగంధి “తో నేను దివ్యౌషధాలు చేసి చూపిస్తాను.

రెండవశ్రోత : ఇంకానయం. మృతసంజీవని చేస్తానన్నావుకాదు.

డా :పరిహాసాలు కాదు సర్. సర్పగంధితో చాలా రోగాలను నయం చేయవచ్చు. కావాలసిందంతా పరిశోధనలకు పెట్టుబడి. అంతే.

మొ.శ్రో.: పరిహాసం కాదు డాక్టరుగారూ! నిజంగానే అంటున్నాను. అంతపెట్టుబడి మనకెక్కడ? ఏ అమెరికావాడో పెడితే తప్ప.

ఇంతలో పెద్దవాన. కూర్చున్నవాళ్ళంతా లేచి బిరబిరా తలో మూలా వెళ్ళారు. మన మిత్రబృందం దేవాలయం సన్నిధిలో పూజాసామాగ్రి అమ్మే ఒక దుకాణం చూరుకింద నిల్చున్నారు.అక్కడా ఈ డాక్టరు గారు వదల్లేదు. సర్పగంధి గొప్పదనాన్ని గురించి ఆంగ్లంలో అనర్గళంగా దంచుతూనే ఉన్నాడు. ఇంతలో వెనుకనుంచి ఒకతను,

” నిజంగానే మీరు అలాంటి మందులను తయారు చేయగలరా?” అని ప్రశ్నించాడు ఆంగ్లంలో.

మిత్రులు ఆశ్చర్యంతో వెనక్కు తిరిగి చూస్తే, అతనొక అమెరికన్.

డాక్టర్ అత్యుత్సాహంతో ” కచ్చితంగా సర్. పెట్టుబడి పెట్టిచూడండి.” అన్నాడు.

ఆ అమెరికన్ “సరే. నేను LEDERLE కంపెనీ ప్రతినిధిని. మాకంపెనీ డైరెక్టర్స్ తో మాట్లాడి, ఒకట్రెండు నెలల్లో మీకు తెలియపరుస్తాను.” అంటూ డాక్టరుగారి చిరునామా తీసుకున్నాడు.

“నిజం సర్. ఆరునెలలు గడువియ్యండి చాలు. నేను మాట నిలబెట్టుకోలేకపోతే ఇండియాకు తిప్పి పంపేయండి” అంటూ ఏదేదో పలవరించసాగాడు పాపమాడాక్టర్.

మర్నాటినుంచీ డాక్టర్ ఎదురు చూపులూ, మిత్రుల పరిహాసాలూ. ఆరువారాల తరువాత LEDERLE COMANY నుంచి డాక్టరుగారికి ఒక ఉత్తరం వచ్చింది.

“మా ప్రతినిధి ద్వారా మీ ఉత్సాహం, ఓషధీజ్ఞానం మాకు తెలిసింది. ప్రజలకోసం కొత్తమందులు కనిపెట్టడమే మా లక్ష్యం. మీరుకనిపెట్టే వాటిల్లో ఏ ఒక్కటి ఫలప్రదమైనా సంతోషిస్తాం. మీరు ఢిల్లీలో మాసంస్థ కార్యాలయానికి వెళ్ళండి. మీప్రయాణ ఏర్పాట్లన్నీ వారు చూసుకుంటారు”.
.
ఇదీ ఆ ఉత్తరం సారాంశం. డాక్టరుగారు ఆ ఉత్తరాన్ని ఓ వందసార్లయినా మిత్రులకు చదివి వినిపించుంటారు.
.
తరువాత ఆయన అమెరికా వెళ్ళడం HETROGEN, TETRACYCLINE, METHOTREXATE(USEFUL IN CANCER TREATMENT) ,POLYMIXIN (Cattle Field) లాంటి దివ్యౌషధాలు కనుక్కోవడం అంతా గొప్ప చరిత్ర.

ఆ మహానుభావుడే డాక్టర్ యల్లాప్రగ్గడ సుబ్బారావు గారు.

జనవరి 12 పూజ్య స్వామీ వివేకానంద జన్మదినం అని అందరికీ తెలుసు. ఆరోజే డాక్టర్ యల్లాప్రగ్గడ సుబ్బారావుగారి జన్మదినం కూడా.

LEDERLE COMPANY వారు తమ ప్రాంగణంలో సుబ్బారావు గారి విగ్రహం ప్రతిష్ఠించి ఆయనపై తమ గౌరవాన్ని చాటుకున్నారు.

భాస్కరుడు, చరఖులనుంచీ, శ్రీనివాసరామానుజం, యల్లాప్రగ్గడ సుబ్బారావు గారిదాకా వేలసంవత్సరాలుగా మన భారతీయ మేధ విశ్వవ్యాప్తం అవుతూనే ఉంది. మన యువతకే అది పనికిరానిదయింది.

SOURCE :
https://en.m.wikipedia.org/wiki/Yellapragada_Subbarow
http://www.ysubbarow.info/