తేదీ 16/12/2018  రోజున మృగవని నేషనల్ పార్క్ (చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్) లో శివశక్తి భాగ్యనగర కమిటీ నిర్వహించిన ఆత్మీయ వనభోజన కార్యక్రమం ఆహ్లాదభరితంగా జరిగినది.

మధ్యలో శ్రీ మద్రామాయణ, మహాభారతాలపై క్విజ్ నిర్వహించి సరైన సమాధానం చెప్పిన వారికి “బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు, లోకమెరుగని యేసు మరోరూపం” పుస్తకాల సెట్ ను బహుకరించడమైనది.

ఇది గత కార్తీకమాసంలో జరగవలసినది.
కారణాంతరాల వలన జాప్యం జరిగింది.
ఇకనుంచి ప్రతి కార్తీక మాసం లో వనభోజన కార్యక్రమం నిర్వహించే సంప్రదాయం కొనసాగించుదాం..

శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు..