1871 క్రిమినల్ ట్రైబల్ ఆక్ట్ = అంటరానితనం =దళితులు

200 సం  ల  బ్రిటిష్ పరిపాలన లో- హిందువులకు  caste అనేది ఉంటుంది అన్న విషయం విపరీతం గ ప్రచారం లోకి వచ్చింది – భారతీయ మేధావులు సైతం ఈ విషయాన్నీ పూర్తిగా చర్చించకుండా లేదా పరిశీలించకుండానే అంగీకరించారు . ఈ రోజుల్లో ఎవరన్నా కుల వివక్ష అనగానే మిగతావారు ఏమి ఆలోచించ కుండా , అన్ని తమకు తెలిసినట్లు గొడవకు దిగుతారు . అంటే caste , దాని పుట్టు పూర్వోత్తరాలు  తెలియకుండానే  దాని గురించి వారికి అన్ని తెలిసినట్లు భావించి  తెలిసినట్లు ప్రవర్తిస్తున్నారు

అసలు caste , కులం , జాతి అంటే ఏమిటి . కులం అంటే సమూహం అని లేదా గుంపు అని అర్ధం  ఉదాహరణకు మానవ కులం  అంటే మానవుల గుంపు లేదా సమూహం అని అర్ధం . అంటే కులం అన్న జాతి అన్న ఒక్కటే , మరి caste  అనేది ఒక పోర్చుగీసు పదం , caste  అనగా class  లేదా తరగతి అని అర్ధం.

పూర్వం యురోపియన్ దేశాల లో caste  system  ఉండేది . అంటే యురోపియన్  క్రిస్టియన్ సమాజం లో   రాజులు ఒక తరగతి అంటే caste , జమీందారులు  , చర్చి పాస్టర్ లు … etc  ఇలాంటి వాళ్ళు ఒక తరగతి , యుద్ధ వీరులు, సైనికులు , నైట్స్ లాంటి వాళ్ళు ఇంకో తరగతి , పెసంట్స్ , సేవకులు , సామాన్య ప్రజలు లాంటి వారు ఇంకో తరగతి. ఇందులో ప్రతి ఒక్కరి తరగతి వారికి ,వారికి పుట్టిన సంతానం వారి తరగతి వృత్తి లోనే కొనసాగాలి  మరియు వారి తరగతి వారితో వివాహం చేసుకోవాలి  ఇలాంటి నిబంధనలు ఉండేవి . దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నేటికీ బ్రిటిష్ రాజుకు పుట్టిన సంతానమే రాజు లేదా రాణి అవుతుంది మరియు హౌస్ అఫ్ లార్డ్స్ లో ఉండే లార్డ్స్ సంతానం పుట్టుక తోనే లార్డ్స్ పిలువబడతారు .  అంటే సేవకులకు పుట్టిన పిల్లకు  పుట్టుకతోనే సేవకులు అన్న మాట .

భారతీయ హిందూ వ్యవస్థ లో  అనేక జాతులు చేసే వృత్తుల ఆధారం గ  కులాలు గ మరియు జాతులు గ ఏర్పాటు చేసుకొని బతుకుతుండేవి .  అలాగే ప్రతి మనిషి వర్ణం అతని  గుణాల మీద ఆధార పది నిర్ణయింపబడేవి . ఏ జాతి వాడైనా ఏ వర్ణం లోకి అన్న వేళ్ళ వచ్చు .. దీనికి ఉదాహరణ బోయ వాడైనా వాల్మీకి  ,క్షత్రియుడైన విశ్వామిత్రుడు … ఇలా  మన పురాణాల నిండా ఇతిహాసాల నిండా చరిత్ర నిండా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

ఆలా యూరోప్  లో  తయారు అయిన  ఈ  caste  ను బ్రిటిష్ అధికారి 1911 లో భారతదేశం లో జనగణన  అనగా census  కోసం వచ్చాడు. అయన భారత సమాజం లో  రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు ,మరియు మిగతా పని చేసేవారిని చూసి , ఓహో ఇక్కడ సమాజం ఎఉరోపెయన్ సమాజం లాగానే ఉన్నది అనుకోని ఆ యురోపియన్  caste  system  ని ఇక్కడ ప్రయోగించాడు . కానీ ఈ సమయమా లో ఆయన చాలా మంది ని వారి సామాజిక తరగతి , వృత్తి మరియు  caste  అంటే ఏమిటి అని అడిగినప్పుడు వారు సమాధానం చెప్పలేక పోయారు . ఆలా చెప్పలేక పోయిన 1500 జాతుల  లేదా కులాల వారిని ఆయన తన కలం పోటు తో  శూద్ర తరగతి లో అనగా బిసీ  లేదా sc /st  తరగతి లో కలిపేశారు . తదనంతరం ఆయన ఒక లేఖ లో ఇలా రాసారు , మనం అనగా బ్రిటిష్ వారితో తయారు చేయబడిన  ఈ caste system  ముందు తరాల పై చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది . ఆ పరిణామాలు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఆలా ఈ caste system  గురించి ఏమి తెలియని ప్రజలు  ఒక 40 సంవత్సరాల తర్వాత అంటే 1947 వచ్చే నాటికి భారతదేశం మొత్తం అందరికి  వాళ్ళ వాళ్ళ enti  అన్న విషయం మరియు caste system  గురించి , అది హిందూ జాతిదే అన్న భావనలోనికి వచ్చేసారు , ఆలా నమ్మించబడ్డారు .

బ్రిటిష్ వారు మన దేశాన్ని చేజిక్కించుకోగానే  చేసిన పని ఏంటి అంటే  అప్పటివరకు మన దేశం లో ఉన్న వ్యవస్థలను మెల్లి మెల్లి గ వాళ్లకు అనుగుణం గ మార్చడం మొదలు పెట్టారు , ఎవరైతే దీనిని వ్యతిరేకించేవారో ,ఎవరైతే బ్రిటిష్ వారికి టాక్స్ కట్టలేదో , మరియు ఎవరైతే స్వతంత్రం కోసం పోరాడారో వారందరిని నేరస్తులు గ పరిగణించేవారు.  వీటిపై అనేక చట్టాలు చేసారు వాటిని ఆధారం గ చేసుకొని శిక్షలు విధించే వారు వాళ్ళను నేరస్తులుగా ముద్ర వేసి శిక్షించే వారు , అందువల్ల ఈ శిక్షలకు చాలా మంది భయపడి నోరు మెదిపి వారు కాదు

బ్రిటిష్ పార్లమెంట్  తయారు చేసిన 1871 క్రిమినల్ tribes  act . ఆ చట్టం అనేక రకాల హిందూ  జాతుల మీద నరమేధానికి చేసిన చట్టం  .

ఈ చట్టం తో ఏ జాతినయినా బ్రిటిష్ వారు నేరస్తులుగా గుర్తించవచ్చు , ఆలా గుర్తించబడ్డ జాతుల కు పుట్టిన పిల్లలు వారి పిల్లలు తరువాతి తారలు అందరు పుట్టుకతో నే నేరస్తులు గ పరిగణింపబడతారు . . బ్రిటిష్ వారి  ఉద్దేశం ప్రకారం భారతదేశం లో అనేక వృత్తులు వంశ పారంపర్యం గ సంక్రమిస్తాయి అలాగే ఈ నేరం చేసే స్వభావం లేదా వృత్తి  కూడా  .  బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని  సిద్ధాంతాల మీద ఈ చట్టాన్ని తయారు చేసింది 1) ఈ జాతి లో లేదా కులం లో పుట్టే ప్రతి ఒక్కరు నేరస్తులే అని 2) ఒకసారి నేరం చేస్తే ఎప్పుడు నేరాలు చేస్తూ ఉంటారు  3) ఇలాంటి నేరస్తులను మార్చాలంటే భయంకరమయిన శిక్షలు తప్పని సరి

ఈ నేరస్తుల జాతిలో  ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ చట్టాన్ని మళ్ళి  మళ్ళి   ఉల్లంఘిస్తే వాళ్లకు 7 సంవత్సరాల దాకా కఠిన కారాగార వాసం విధించేవాళ్ళు  లేదా శాశ్వతం గ  వేళ్ళని దూర ప్రాంతాలకు తరలించేవారు , అంటే ఏ అండమాన్ నికోబర్ కో లేదా మాల్దీవ్ లకు .. ఆలా అన్నమాట .  ఆలా నేరస్తులుగా పరిగణింపబడిన ఆ జాతి  ఊరికి దూరం గ నివసించాలి .  ఇది ఎంత తీవ్రం గ అమలు చేసేవారు అంటే నేరస్తులుగా పరిగణించబడి ఆ జాతి ఒక ఊరినుండి వేరే ఊరికి వెళ్లాలంటే  బ్రిటిష్ వారిదగ్గర అనుమతి తీసుకుకోవాలి, ఆ జాతులకు చెందిన మగ  వారు ఎప్పటికప్పుడు పోలీస్ లకు వఛ్చి కనపడుతూ ఉండాలి  వారి కదలికలు పోలీస్ లు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండే వారు

ఈ క్రిమినల్ ట్రైబ్స్ ఆక్ట్ పరిణామాలు, ఏరుకుల కులస్తుల మీద అధ్యయన చేసిన మీనా రాధాకృష్ణ గారి వ్యాసం నుండి కొన్ని ముఖ్య విషయాలు ఇక్కడ ఉదాహరణకు రాస్తున్నాను .

క్రిమినల్ ట్రైబ్స్ ఆక్ట్ 1871 లో  వచ్చిన తర్వాత దానిని  1897 లో మరియు 1911 లో సవరించారు

1911 లో సంచార జాతి అయిన ఎరుకల కులస్తులను నేరం చేసి జాతిగా బ్రిటిష్ వారు  క్రిమినల్ టిబెస్ ఆక్ట్ ప్రకారం పరిగణించారు

ఎరుకల కులస్తులు వర్తకం చేసి జీవించేవారు  అంటే ట్రేడింగ్ అన్న మాట , వారు ధాన్యాన్ని మరియు ఉప్పును మారుమూల పల్లె లకు కూడా తీసుకుపోయి  అమ్ముకుని జీవనం సాగించే వారు .  కొన్ని సమయాల లో   కేవలం వీరి వల్ల  మాత్రమే ఉప్పు అందరికి లభించేది  అంటే ఎక్కడో ఉన్న పల్లెలకు కూడా వీరే ఆధారం  ఇంతే కాకుండా  పశువులను పెంచడం , అమ్మడం , వెదురుతో సామానులు తయారు చేయడం కూడా వీరు  చేసే వారు.  1850 లో బ్రిటిష్ వారు వేసిన రైలు మరియు రోడ్ మార్గాల వాళ్ళ  ఈ ఎరుకల కు  ఆదాయం తగ్గింది ,1877 లో వచ్చిన కరువు వల్ల  , వీరి  ఆవులు , ఎద్దులు పెద్ద మొత్తం లో  చనిపోయాయి , ఈ పరిణామం వల్ల  వీరి వర్తకం దెబ్బ తిన్నది, పెద్ద మొత్తం లో నష్ట పోయారు.

ఈ కరువు  అవకాశాన్ని అదునుగా తీసుకున్న బ్రిటీష్ వారు ధాన్యాన్ని వర్తకం చేసే అధికారాన్ని తమకు ఆదాయం కోసం  కొద్దీ మంది ధనవంతులకు ముట్టచెప్పారు  ,  చిన్న మొత్తం లో  వర్తకం చేసే ఎరుకలకు  ఇది ఒక తీవ్ర పరిణామం .  అయితే కొద్దీ రోజులు వీరు తమ వృత్తిని వదిలి అడవి మీద ఆధార పడి  బతికే వారు , అంటే అడవి నుండి కట్టెలు , గడ్డి , తేనే, వెదుర్లు ,తీగలు  ఇలాంటివి తెఛ్చి  మరియు బుట్టలు తయారు  చేసి అమ్ముకునే వారు .  బ్రిటిష్ వారు 1880 ఇంకో చట్టాన్ని తీసుకువచ్చారు , ఈ చట్టం అడవి నుండి కట్టెలు ,వెదుర్లు , గడ్డి లాంటివి తెఛ్చి అమ్ముకోడాన్ని మరియు అడవిలో పశువులు మేపడాన్ని  నిషేదించింది .  దీని వల్ల  వారికి కావలసిన ముడి వస్తువులు దొరకక పోవడమే కాకుండా , వారి పశువులను మేపుకోడానికి అవకాశం లేకుండా పోయింది.

ఈ ఉప్పు మరియు ధాన్యం వర్తకం బ్రిటిష్ వారిని ఆకర్షించింది , ఈ వర్తకం వారికి మంచి ఆదాయ వనరుగా కనిపించింది , దాని వాళ్ళ  1880 లో బ్రిటిష్ ఉప్పు వర్తకాన్ని ధనవంతులైన పెద్ద వ్యాపారులకు అప్ప చెప్పారు . బ్రిటిష్ వారి ద్వారా నియమించబడిన  వర్తకులు ఈ ఉప్పును  రైల్వే స్టేషన్  ల వద్ద అమ్మే వారు , వారు ఉద్యోగులను నియమించి పల్లెలలో కూడా  ఉప్పును అమ్మడం మొదలు పెట్టారు  ఇది ఎరుకల పాలిట పెనుఘాతం అయింది.

ఈ అన్ని పరిణామాల వాళ్ళ ఎరుకలకు తీవ్రమైన నష్టాలు చోటు చేసుకున్నాయి , వారికి బ్రతుకు దెరువు కష్టం గ మారింది ఈ ఆర్ధిక పరమైన కారణాల వాళ్ళ వారు సమాజానికి దూరం కావలసి వచ్చింది ,  అనేక సందర్భాలలో ఎరుకలను బ్రిటిష్ వారు యూరోప్  కు చెందిన జిప్సీ జాతులు గ వర్ణించే వారు , నిజాన్ని వారికి  మరియు భారత దేశం లో ఉన్న అనేక సంచార జాతులకు ఎంతో తేడా ఉన్నది. ఈ సంచార జాతులు  సోమరి పోతులని , వీరికి పని చేయడం ఇష్టం ఉండదని బ్రిటిష్ వారు భావించేవారు ( అంటే జిప్సీ ల లాగ అన్న మాట) , కానీ నిజానికి ఎరుకలకు చాలా కచ్చితమైన వర్తక వ్యవహారం ఉండేది , పైగా వారి వర్తకం ఉప్పు మరియు ధాన్యం  సీజన్లో ల మీద ఆధార పడి ఉండేది , మిగతా సమయాలలో వారు వేరే వృత్తి చేయడానికి ఇష్టపడే వారు కారు

ఇలా కాల క్రమం లో అనేక కారణాలు చూపి 1911 లో ఎరుకలను నేరస్తుల జాతి జాబితా లో చేర్చారు . 6000 మంది ఎరుకలను గుంటూరు జిల్లా లో ఉన్న స్టువర్ట్ పురానికి తరలించారు . ఈ ఊరిపేరు హారొల్ద్ స్టువర్ట్ పేరు మీద పెట్టారు . ఈయన ఈ సెటిల్మెంట్ ని ఇక్కడకు తెచ్చ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన   వాడు .  ఇలా చేర్చ బడిన ఎరుకలను సాల్వేషన్ ఆర్మీ అనే క్రిస్టియన్ మిషనరీ కు అప్పగించారు . వీరి పని ఎరుకలను మంచి గ మార్చి వారి చేత ఉద్యోగాలు చేయించడం . వీరు ఎరుకలను పొగాకు ఫ్యాక్టరీ లో లేదా వ్యవసాయం లో పనికి కుదిర్చారు .  కాలాంతరం లో వ్యవసాయానికి అలవాటు పడిన ఎరుకలు , ఆ భూములకు పట్టాలు ఇప్పించమని దరఖాస్తు చేసుకుంటే  వారికి ఈ సాల్వేషన్ ఆర్మీ  రక రకాల సాకులు చూపించి అడ్డుకునేది … ఇలా ఎన్నో దారుణాలకు గురైన చాలామంది   ఈ రోజు వారి చరిత్ర తెలియక మల్లి ఆ మిషనరీ మాయలో పడి వారి ఈ స్థితి కి కారణం ఈ హిందూ సమాజం అని  , హిందూ  సమాజం మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు

బంజారాలు , లంబాడీలు , యానాదులు , ఎరుకలు  ఇలా అనేక కులాలను నేరస్తుల జాతులుగా నిర్ణయించారు బ్రిటిష్ వారు

కావలి  దగ్గర ఇంకో settlement  ఇలా చాలా చాల సేట్ఠలెమెంట్స్ తయారు అయ్యాయి , నా ఉద్దేశం లో ఈ అంటరాని తనం  మరియు ఊరికి దూరం గ వెలివేయడం లాంటివి ఇక్కడ నుండి నే మొదలయ్యాయి .  ఇప్పుడు గమనించండి చాలా ఊర్లలో వేరే వేరే పల్లెలు  దూరం గ ఉంటాయి , అంటే  ఆ సేట్ఠలెమెంట్స్ కాలాంతరం లో ఇలా వేరే పేర్లతో వ్యవహరించే వారు  .

 

Ref 2

ఈ నేరస్తుల జాతులని  అప్పట బ్రిటిష్ గవర్నమెంట్  వారి ప్రభావం వల్ల   ప్రజలు   దూరంగా ఉంచడం మొదలుపెట్టారు , ఊరికి దూరం గ కొన్ని settlements  లాగ ఏర్పాటు చేసి సాల్వేషన్ ఆర్మీ లాంటి క్రిస్టియన్ మిషనరీస్ కు  వీళ్ళను మార్చమని పురికొలిపారు

అప్పట్లో ఈ వ్యవహారాన్నంతా పరిశీలించిన మున్షి కమిటీ 1939 , తన నివేదిక లో ఇలా పేర్కొంది . క్రిస్టియన్ మిషనరీ లు  సెటిల్ మెంట్స్ నిర్వహణ కోసం మరియు  అక్కడ పని చేసే వారి ద్వారా వచ్చిన ఆదాయం  అంత దుర్వినియోగం చేసి వారి క్రిస్టియన్ మిషనరీ పనులకు , మాత వ్యాప్తి కోసం  మరియు ప్రచారం కోసం వాడుకున్నారు అని .

షోలాపూర్ సేట్ఠలెమెంట్స్ లో మత ప్రచారాన్ని కోసం ప్రింటు చేసిన పాంప్లేట్ల  ఖర్చు 500 రూపాయలు  అని సేట్ఠలెమెంట్స్ లెక్కలలో రాసి ఉండడం గమనించారు

కొన్ని ఎవాంజెలికల్ మిషనరీస్ అయితే ఇంకొంచెం ముందుకు పోయి ఈ సేట్ఠలెమెంట్స్ లో  పని చేసే వారికి వచ్చిన జీతాలను వీళ్ళే భోంచేసి వారు , దానికి అధికారికంగా లెక్కలు చూపించేవారు

ఈ నేరస్తులను మంచి మార్గం లో కి  తీసుకు రావడానికి నిర్దేశించబడిన ఈ  క్రిస్టియన్ మిషనరీస్ లో  ఆర్ధిక పరమైన ఎన్నో అవకతవకలు జరిగినట్లు , ఈ మిషనరీస్  మనిషుల శ్రమను దోచుకొని వారి ఈ పరిస్థితి కి కారం హిందూ సమాజం గ  చూపించే ప్రయత్నం చేసారు అని మున్షి కమిటి తన నివేదిక లో పేర్కొంది .

 

 

1871 లో ఈ చట్టం ప్రవేశ పెట్టిన ప్పుడు భారతదేశపు జనాభా దాదాపు 20 కోట్లు , అందులో నేరస్తులు గ ముద్ర వేయబడ్డ జాతుల జనాభా 6 కోట్లు , అంటే దాదాపు 30 శాతం జనాభా కాల క్రమం లోనేరస్తులుగా వెలివేయబడ్డారు , అంటరాని వారుఅయ్యారు. 1911 జన గణన లెక్కలలో ఈ నేరస్తుల జాతులను హిందువుల నుండి వేరు చేసారు ,1947 తర్వాత వీళ్ళను దళితులుగా వ్యవహరించడం మొదలు పెట్టారు .

స్వతంత్రం రాగానే 1871 క్రిమినల్ tribes  చట్టాన్ని రద్దు చేసారు . 1950 లో మొత్తం 22 రాష్ట్రాలలో  1108 sc  కులాలు,744 st  తెగల కు  రాజ్యాంగ బద్ధంగా సహాయం చేయడానికి మన పెద్దలు  చట్టాలను ఏర్పరచారు

విచిత్రం ఏమిటంటే sc /st  సంఘాలకు చెందిన ఏ ఒక్కరు కూడా ఈ నిజం దళితులకు ఇంతవరకు చెప్పలేదు , ఈ నాటికీ కూడా మిగతా కులాలే తమ స్థితికి కారణం అని దళితులూ బలం గ నమ్ముతున్నారు  లేదు నమ్మించారు 

భారత దేశం లో బ్రిటీష్ వారి సంఖ్యా ఏ సమయం లో నైనా కొన్ని వేలకు మించలేదు, అలంటి సందర్భం లో ఈ బ్రిటిష్ వారికి మన సమాజం గురించి ఎలా తెలుస్తుంది, ఇలాంటి చట్టాలు చర్యలు ఎలా తయారు చేస్తారు మరియు తీసుకుంటారు అని మీకు అనుమానం రావచ్చు.

బ్రిటిష్ వారికి ఇలాంటి వె కాదు ఎలాంటి చట్టాలైనా చేసే పవిత్రమైన ,దైవం చే ఆపాదించబడిన  మత పరమైన  రాజకీయ అధికారాన్ని వారికి వాళ్ల  చర్చి  ఇచ్చింది .  భారతీయల పై తీసుకునే చర్యల వాళ్ళ వారు స్వర్గానికి పోతాము అని బాగా విశ్వసించే వారు , అందులో ఏమి తప్పు లేదు అని భావించే వాళ్ళు , పైగా ఈ చర్యల వల్ల  వారి ఆదాయం పెరిగి  బ్రిటిష్ రాజులా దగ్గర నుండి మరియు  చర్చి దగ్గర నుండి  అభినందనలు అందుతాయి .  ఇది బాగా విశ్వసించిన బ్రిటిష్ వారు  అనేక క్రూరమైన చట్టాలను మన భారతీయుల మీద ప్రయోగించారు . వాటి పరిణామాలు ఇప్పుడు మనం చూస్తున్నాం .

ఇవి చరిత్రలో మరుగు పడ్డ, మరుగు పరచ బడ్డ  నిజాలు , మేలుకోండి మిత్రులారా  మీరు మీ పరిశోధన చేయండి … పరిశోధించడం అనేది హిందూ రక్తం లో ఉంది ..

మన దేశం లో బ్రిటిష్ వారికి పూర్వం కులాలు , జాతుల మధ్య మత  విద్వేషాలు ఉండేవి కాదు, ఇప్పుడు జరిగే ఈ కుల  గొడవలకు  కారణం ఎవరో మీరే నిర్ణయించండి …….

 

సర్వే  జన సుఖినో భవంతు

Bharata vedanta

 

References

1-colonial construction of a criminal tribe -madras presidency- meena radha krishna

2- k.m kapadia criminal tribes of india

3-http://ccnmtl.columbia.edu/projects/mmt/ambedkar/web/readings/Simhadri.pdf

4- https://www.myind.net/Home/viewArticle/scheduled-castes-and-tribes-fault-lines-created-british-raj