ఇలాంటి పైశాచిక స్వభావం మగవాళ్లకు మాత్రమే ఉంటుంది అనుకోకండి.ఆడవాళ్లకు కూడా ఉంటుంది అని నిరూపిస్తున్నారు ఇటువంటి వారు.
పద్మావతి కల్పితం, ఖిల్జీ చారిత్రక పురుషుడు అనడంలోనే ఈవిడ ఉద్దేశ్యం పైసాచికత్వం బయటపడుతుంది.
ఈవిడ ఖిల్జీని పొగిడిన విధానం చూస్తుంటే..పొరపాటున ఈవిడ గాని పద్మావతి గా పుట్టిందా ఖిల్జీ వీరి రాజ్యానికి రానవసరం లేదు.ఈవిడే ఖిల్జీ రాజ్యానికి గుడ్డలిప్పుకుని ఎదురు వెళ్ళేది. అంత ప్రేమ కనపడుతుంది మరి.

అసలు మనలను ఏలిన ముస్లిం చక్రవర్తులు ఎంత కామాందులో చరిత్ర తెలిసినవారు మరవరు. మొగ్గుల్స్ ఎంత కామాందులో అది మసి పూసి మారెడుకాయ చేసిన అప్పటి ఏలివారు, కమ్మీలు చూపిన చరిత్ర ఇప్పటికీ మన పాఠ్యపుస్తకాలలో చూడగలం. మొఘల్స్ హిందూ ముస్లిమ్ సఖ్యత కోసం పాటుపడ్డారని హిందు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారని మురిసిపోతాం.కానీ వారి అమ్మాయిలను ఎంత మంది హిందువులకు ఇచ్చి పెళ్లి చేశారని అడగం. ఎంతో మంది హిందువులను చంపిన,ఎన్నో గుళ్లను నేలమట్టం చేసిన ఔరంగజేబు పేరు మీద కూడా ఢిల్లీ లో ఒక రోడ్ వేసి సెక్యూలర్ అని మురుసిపోయే వెర్రి జాతి మనది.

పద్మావతి సినిమా రిలీస్ కాకుండా ఇంత వివాదం కావడం,దానిని అడ్డుకుంటాం అంటూ హెచ్చరికలు చేయడం ఆక్షేపనీయమే.
అయితే దీనికి ముఖ్య కారణం భన్సాలీ కాదా?? తన సినిమాలో ఎవరికీ తెలియని చరిత్ర చూపిస్తా అంటూ పిచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి జనాలకు లేనిపోనీ అనుమానాలను కల్పించింది ఆయన కాదా? చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు ప్రవర్తిస్తున్నాడు.సినిమా మొదలు పెట్టినప్పుడు హిందువులను పట్టించుకుంటేగా..??

ఏకు మేకై కూర్చుంటే ఇప్పుడు తెలిసివస్తుంది హిందువుల సంగతి భన్సాలికి. ఇక దేవీ గారి వర్ణన చూస్తుంటే..పెద్ద కులం ఆడవారుఎలా పోయినా పర్లేదు అన్నట్టు ఉంది ఆమె వ్యాసం. ఒకరికి రేప్ జరిగింది అని తెలిస్తే ఆ అమ్మాయి ది పెద్ద కులమా చిన్న కులమా అని చూసి పోరాటం చేస్తుంది కాబోలు. పద్మావతికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం మాని చిన్న కులాలవారికి జరగలేదా అసలు పద్మావతి ఒక కల్పితం అని వాదించడం లొనే తెలుస్తుంది ఈవిడ వాదన ఎంత వికృతం గా ఉందొ??

ఈవిడనే కాదు ఎంతో మంది ఈ సినిమా ని ఆపాలి అనే వారికి వ్యతిరేకం గా మాట్లాడుతున్నారు. అయితే వీరికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు కనిపించలేదేమో..కనిపించినా కళ్ళు మూసేసారేమో. YS రాజశేఖర్ రెడ్డి కాలం లో “డావేన్సీ కోడ్” అనే సినిమా వచ్చింది. ఇది క్రైస్తవుల నమ్మకాలకు వ్యతిరేకం గా ఉంది అని విమర్శలు వచ్చాయి. అయితే ఈ సినీమా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రపంచ వ్యాప్తం గా క్రైస్తవ దేశాలు అయిన అమెరికా,యూరోప్ దేశాలలో కూడా విడుదల అయింది.కానీ ఇక్కడ సెన్సార్ అయిన ఆ సినిమాను ఏకపక్షం గా రేలీజ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఆపుచేయించాడు అప్పటి ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి.ఆపుచేయడానికి తాను క్రైస్తవుడిని అని ఒకే ఒక్క కారణం తప్ప ఇంకొకటి లేదు అనేది అందరికి తెలిసిన విషయమే.సినిమా వారు ట్రిబ్యునల్ కి వెళ్లి సినిమా రేలీజ్ చేసుకున్నారు అది వేరే విషయం. అప్పుడు ఈ దేవి గారు పందులు కాయడానికి వెళ్ళారా?

హాలీవుడ్ లో రెహ్మాన్ సంగీత దర్శకునిగా ముహమ్మద్ ప్రవక్త మీద ఒక సినిమా మొదలయ్యింది. ముస్లిం అయిన రెహ్మాన్ సినిమాలో మొహమ్మద్ ని తప్పుగా చూపించలేదు అని మొత్తుకుని చెబుతున్నా ఆ సినిమా విడుదల చేయనీయలేదు ముస్లిములు. పైగా రెహ్మాన్ మీద ఒక ఫత్వా కూడా జారీచేశారు. మరి ఇది జరుగుతున్నప్పుడు దేవీ గారు గాడిదలు కాయడానికి వెళ్ళారా??

దేవీ గారైనా..ఇంకొకరైనా హిందువుల మీద అంటే పడి లేచే ఈ కుహనా మేధావులను మరెంతో కాలం ఈ హిందూ సమాజం సహించదు.ఆల్రెడీ ఆ పరివర్తన మొదలయ్యింది కూడా. ఇక పద్మావతి సినిమా విషయానికి వస్తే సినిమా విడుదల వరకు నేను సంయమనం పాటిస్తాను. ఒకవేళ పద్మావతి చరిత్రను వక్రీకరిస్తే మాత్రం సినిమా అడ్డుకునే విషయం లో నేనే ముందు ఉంటాను. ఇలానే వీరిని ఉపేక్షిస్తే ఈ రోజు పద్మావతి చరిత్రని వక్రీకరిస్తారు రేపు ఏకం గా సీత చరిత్రనే వక్రీకరిస్తారు.
వారికి ఈ దేవిలాంటి శూర్పణకలు వంతు పాడతారు. వీటికి ముగింపు ఎక్కడో ఒకదగ్గర పలకాలి.అది ఇప్పుడే జరగాలి.

 

మీ
భాస్కర్ కిల్లి.