ఈ రోజు మీకు జ్ఞాన బల్బ్ డింగ్ మని వెలిగిపోతుంది..!!!
చాలా మంది చదువుకున్న మూర్కులు, అమాయకులు భారత దేశం లో స్త్రీ ని అణగదొక్కుతున్నారు అని, స్త్రీ కి అన్యాయం జరుగుతుంది అని ఓ తెగ గుండెలు బాదుకుంటున్నారు.. వాళ్లకి తోడూ గా కమ్యూనిస్టులు, మత మార్పిడి మాఫియా ఎలాగో ఉంటారు..
అవును మన దేశం లో స్త్రీలకు స్వేచ్ఛ లేదు అని, దీనికి కారణం హిందువుల పురాణాలు, గ్రంధాలూ అని వెనుక అందుకుంటారు..!!
ఈ రోజు బైబిల్, ఖురాన్, వేదాల్లో స్త్రీ కి ఉన్న విలువ ఏంటి?? ఏ మతం స్త్రీ ని గౌరవించింది.. ఏ మతం స్త్రీ ని వాడుకుంది..?? మొదలగు విషయాలు చెప్తాను..!!
మీకు ఆశ్చర్యమ్ కలిగించే ఎన్నో విషయాలు తెలుస్తాయి, పోస్ట్ పూర్తిగా చదవండి..!!
బైబిల్ లో స్త్రీ కి ఉన్న విలువ :-
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
👉 స్త్రీకి పురుషుడితో పాటు సమాన హోదా లేదా హక్కులు లేవు “స్త్రీ మౌనంగా ఉండవలసిందేగాని, ఉపదేశించుటకైననూ పురుషుని మీద అధికారము చేయుటకైననూ ఆమెకు సెలవీయను” (1 తిమోతి – 2;12)
👉 స్త్రీ మగ పిల్లవాడిని కంటే ఆమె రక్తశుద్ధి కొరకు 33 రోజులు ఉండవలెను అదే ఆడ బిడ్డ కంటే మాత్రం ఆమె అరవై 66 రోజులు రక్త శుద్ధి కోసం వేచి ఉండాలి (లేవియా కాండం 12 : 2-5)
అంటే ఆడ పిల్లని కంటే రక్త శుద్ధి కోసం ఎక్కువ రోజులు అగాలా??
👉 భర్తకి భార్య మీద అనుమానం వస్తే ఆమె చేత బురద తాగించాలి ఒకవేళ ఆమె తప్పు చేస్తే ఆమె నడుం పడిపోయి కడుపు ఉబ్బి పోతుంది… తప్పు చేయకపోతే గర్భం దరిస్తుంది.. మరి ఇదే విషయం భర్తలకు మాత్రం చెప్పలేదు.. (సంఖ్యా కాండం 5: 11-29)
👉 ఒకడు వారి ఇంట్లో పనిచేసే పని అమ్మాయి ని రేప్ చేస్తే ఆమె అతని పనిమనిషి కనుక ఒక గొర్రెని యహోవా కి బలి ఇవ్వాలి, ఇచ్చేస్తే వాడు చేసిన పాపం పరిహారం అవుతుంది (లేవియా కాండం 19: 20-23)
👉 స్త్రీకి పుట్టినవారు దేవుడు దృష్టికి ఎట్లు శుద్ధుడు గా కనిపిస్తాడు?? (యోబు 25: 4)
అయితే స్త్రీ కి పుట్టడమే తప్పు ఆ?? మరి యేసు కూడా మేరీ పుట్టాడు.. గా?!?
👉 మీరు పిల్లలలో మగవారినందరిని, స్త్రీలలో పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపండి పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీకోసం ఉంచుకోండి (సంఖ్యా ఖండము -31; 17,18)
👉 “పురుషుడు స్త్రీని ఏలును” (ఆదికాండము; 3-16)
👉 బైబిల్ దేవుడు యహోవా అయిన నా మాట మీరు వినలేదు కనుక మీ భార్యలను వేరే వాళ్ళకి అప్పగిస్తాను (యిర్మియా; 8- 9,10)
రాముడు తన భార్యని అపహరించిన రావణుడిని మాత్రమే శిక్షించాడు..మండోదరిని గౌరవం గానే చూశాడు..ఒకవేళ రాముడు ‘వాడు నాభార్యని అపహరించాడు కనుక నేను వాడి భార్యని అపహరిస్తాను’ అని ఆనిఉంటే నిర్మొహమాటంగా రామున్ని కూడా సైకో అనే అనేవాడిని.. అలా చేయలేదు కనుకే దేవుడయ్యాడు..
పాండవులు ద్రౌపది ని పరాబవించిన దుర్యోధనుణ్ణి అతని సోదరులని మాత్రమే శిక్షించారు.. మేము కూడా దుర్యోధనుడి భార్య చీర లాగుతాం అనలేదు.
ఖురాన్ లో స్త్రీ విలువ:-
°°°°°°°°°°°°°°°°°°°°°°
ఖురాన్ 2: 228 పురుషుడు కి స్త్రీ మీద ఆధిక్యత ఉంది
ఖురాన్ 4 : 34 పురుషడు స్త్రీ ని నిర్వహించేవాడు
ఖురాన్ 4 : 35 భర్తల మాట భార్య విననప్పుడు వారి ని శిక్షించాలి
ఖురాన్ 24:13 ఒక స్త్రీ అత్యాచారాన్ని నిరూపణకు నలుగురు పురుషులు కావాలి
ఇక తలాక్, తలాక్.. నిఖా హాలలా పదాలు వింటే ముస్లిం స్త్రీలు ఎలా భయపడతారో, బాధ పెడతారో తెలిసిందే..!!
వేదం లో స్త్రీ విలువ :-
°°°°°°°°°°°°°°°°°°°°
వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. విద్యార్ధుల పాఠశాల చదువుల్లో, ఐఏఎస్ అభ్యర్ధులకు, ఇతర ఉద్యోగార్ధులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఇక తమనుతాము సంఘసంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమని చెప్పుకునే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదికసంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.
స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి – యజుర్వేదం 10.03
స్త్రీలు మంచి కీర్తి గడించాలి – అధర్వణవేదం 14.1.20
స్త్రీలు పండితులవ్వాలి – అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)
స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి – అధర్వణవేదం 14.2.74
స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి – అధర్వణవేదం 7.47.2
స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి – అధర్వణవేదం 7.47.1
పరిపాలన విషయంలో స్త్రీలు:-
పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి – అధర్వణవేదం 7.38.4
దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి- ఋగ్వేదం 10.85.46
ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.
ఆస్తిహక్కు:-
పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది- ఋగ్వేదం 3.31.1
కుటుంబం:-
సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- అధర్వణవేదం 14.1.20
స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- అధర్వణవేదం 11.1.17 (స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)
నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- అధర్వణవేదం 7.46.3
ఉద్యోగమ్:-
స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2
స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి- యజువేదం 16.44 (ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం. స్త్రీలు బయటకురాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా. శ్రీ రామాయణంలో కైకయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చిన అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).
కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి- ఋగ్వేదం 10.85.26
ఓ స్త్రీల్లారా! పురుషలతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాకా. మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాకా. మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్దం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను- ఋగ్వేదం 10-191-3
వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్రా వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్పబడింది.
ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్యసందేశం ఇచ్చినట్టుగా లేదు.
వివాహం – విద్యాభ్యాసం:
ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు – అధర్వణవేదం 14-1-64 (ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు).
మరి కొన్ని ముఖ్య విషయాలు :-
బ్రిటన్ లో ఓటు హక్కు వచ్చింది పురుషులకి 1802 లో స్త్రీ లకి 1918 లో
కెనడా లో ఓటు హక్కు వచ్చింది పురుషులకి 1867 లో స్త్రీలకు 1917 లో
అమెరికా లో ఓటు హక్కు వచ్చింది పురుషులకి 1788 లో స్త్రీ లకి 1920 లో
ఫ్రాన్స్ ఓటు హక్కు వచ్చింది పురుషులకి1848 లో స్త్రీలకు 1944 లో
ఇటలీ లో ఓటు హక్కు వచ్చింది పురుషులకిీ 1861 స్త్రీ లకి 1946 లో
స్వీటీజర్లాండ్ లో ఓటు హక్కు వచ్చింది పురుషులకి 1848 లో స్త్రీ లకి 1971 లో ఓటు హక్కు వచ్చింది
భారత్ లో స్వాతంత్రం వచ్చిన రోజునుండే పురుషులకి, స్త్రీ లకి ఒకే సారి ఓటు హక్కు ఇవ్వటం జరిగింది..!!!
చాలామందికి ఒక అపోహ ఉంది భారతదేశంలో స్త్రీల రక్షణ లేదని ఎక్కువగా అత్యాచారలు అవుతాయని ప్రపంచం లోనే ఎక్కువగా భారతదేశంలో మాత్రమే స్త్రీల పై దాడులు జరుగుతాయని..
కానీ నిజం మాత్రం ఇది కాదు, అభివృద్ధి చెందిన దేశాలు అని గుండెలు బాదుకుంటున్న అమెరికా, బ్రిటన్, స్వీడన్, కెనడ లాంటి దేశాల్లో ఎక్కువగా స్త్రీ లపై దాడులు జరుగుతున్నాయి.
ప్రపంచం లో స్త్రీ లపై దాడులు కోసం ఈ లింక్ చూడండి ( http://indiafacts.org/atrocity-literature-dismantle-hindui…/ )
స్త్రీని దేవతగా పూజించే పుణ్యం దేశం మనది..!
ఒకసారి మన చరిత్రలోకి వెళ్తే 1000 సం. క్రితమే రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, పల్నాటి నాగమ్మ, ఇలా ఎందరో స్త్రీలు ఏకంగా రాజ్యాలని పాలించారు.
కానీ విదేశాల్లో అసలు స్త్రీలు పరిపాలించడం అనేది ఈ మధ్యనే ప్రారంభమైంది అంతెందుకు అమెరికాలో ఇప్పటి వరకు ఒక్క మహిళ ప్రెస్సెడెంట్ కూడా రాలేదు…!!!! కాని మన భారతదేశంలోని ప్రతిభా పాటిల్ మీరాకుమారి లాంటి ఎంతో మంద స్త్రీ లని దేశ అత్యున్నత పదవుల్లో కూర్చోబెట్టాము..!!!
ఇప్పుడు చెప్పండి…!!! ఎవరు స్త్రీలని గౌరవించింది, ఎవరు స్ట్రీలని అణగదోక్కింది..!!!