హిందూమత గ్రంధాలలో లేని అర్ధాలు పుట్టించి, ఉన్న విషయాలను వక్రీకరించి క్రైస్తవమత ప్రచారకులు తమకనుకూలంగా ప్రచారాలు జరుపుతున్న ఈ కాలంలో, బైబిల్ లో ఉన్న విషయాలను ప్రస్తావిస్తూ ఒక మాజీ క్రైస్తవుడు వ్రాసిన “బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు” అనే పుస్తకంపై చర్చకు ఆహ్వానిస్తే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ క్రైస్తవ సంస్థలమని చెప్పుకుంటున్న వారి స్పందన ఎలాఉందో చూడండి.

 • ఈ పుస్తక మొదటి ముద్రణ ప్రచురణ తేదీ: 01 జనవరి 2017

 • చర్చ జరపడానికి మేము పెట్టిన నిబంధనలు

  1. ఈ పుస్తకంలో ఉన్న ఏ అంశమైనా బైబిల్ లోనిది కాదని నిరూపిస్తే, మా క్షమాపణలు తెలియజేసి ఆ అంశాన్ని పుస్తకం నుంచి తొలగిస్తాం.
  2. అసలు ఈ పుస్తకం మొత్తం తప్పని నిరూపిస్తే, మా క్షమాపణలు తెలియజేసి పుస్తకాన్ని విరమించుకుంటాం.  అలాగే, మేము ఇక బైబిల్ గురుంచి ప్రస్తావించం.
  3. ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలలో ఎలాంటి తప్పులు లేవని మీరు అంగీకరిస్తే, మీ అంగీకారాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వాలి.  ఆ అంగీకార పత్రాన్ని ఈ పుస్తకం తదుపరి ముద్రణలలో ప్రచురిస్తాం.
  4. ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలులో ఎలాంటి తప్పులు లేవని మీరు అంగీకరిస్తే, మీరు అప్పటినుంచి బైబిల్ గురుంచి ప్రస్తావించకూడదు. 
 • ఈ విషయంపై స్పందించిన వివిధ క్రైస్తవ మత భోధకుల తీరు ఈ క్రిందివిధంగా ఉన్నది.

కొడవళ్ళతో నరుకుతామన్నారు

 • తేదీ: జనవరి 2017

 • పుస్తకం వ్రాసినందుకే పరిశుద్ద గ్రంధమైన బైబిల్ లో పరిసుద్దాత్మ చెప్పినట్లుగా కొడవళ్ళతో నరుకుతామంటున్నారు బైబిల్ బోధకులు వి.పి. రెడ్డి గారు.

 • మతఛాందసులు ఎవరు?  చర్చకు ఆహ్వనించినవారా, లేదా బైబిల్ లో చెప్పిన విధంగా కొడవళ్ళతో నరుకుతామంటున్న వారా?

 • ఆలెక్కన హిందూ గ్రంధాలను వక్రీకరిస్తూ పుస్తకాలు వ్రాసినవారిని ఏంచేయాలి?

అదితప్ప అన్నీ మాట్లాడి వెళ్ళేరు

 • తేదీ: 13 జనవరి 2017.

 • చర్చ నియమ నిభందనలు గురుంచి మాట్లాడటానికి వచ్చిన  బైబిల్ బోధకులు విజయ్ కుమార్ గారు మాట్లాడినతీరు చూడండి.

 • అసలు చర్చ గురుంచి మాట్లాడకుండా, మతం మార్చుకోవాలనే విషయం లేవనెత్తి, అక్కడ ఉన్న పెద్దలపై కనీస గౌరవం లేకుండా మాట్లాడి, రబస చేసి వెళ్ళిపోయారు.

 • ఇలాంటి వ్యక్తులనుకూడా గౌరవంగా సంబోదిస్తూ వ్రాయడం చాలా ఇబ్బందితో కూడిన పని.

మళ్ళీ కలుస్తామన్నారు

 • తేదీ: 23 ఫిబ్రవరి 2017.

 • చర్చ నియమ నిభందనలు గురుంచి మాట్లాడటానికి వచ్చిన  బైబిల్ బోధకులు సత్య ప్రకాష్ గారు.

 • పుస్తకంలో తాను అంగీకరించని విషయాలు ఉంటే వారం రోజులలో చర్చకు వస్తానని ప్రస్తావించారు.  పదిరోజుల తరువాత ఫోన్ చేసి మాట్లాడినా చర్చ గురుంచి స్పందించలేదు.  పలుసార్లు ప్రయత్నాలు చేసినతరువార హిందూ గ్రంధాలపై కూడా చర్చ పెట్టాలి అని నియమం (సాకు) పెట్టి తప్పించుకున్నారు.

దూషించారు, పుస్తకాన్ని చింపేశారు

 • తేదీ: 8 మార్చ్ 2017.

 • చర్చకు పిలవకుండా పుస్తకాన్ని చింపుతున్నారు ప్రజ్ఞులు.  1:54:00 దగ్గర చూడండి.

 • అకారణంగా వ్యక్తిగత ధూషణలకు దిగేరు.  1:39:47,  1:55:58

 • పరిపూర్ణానంద స్వామి వారి పేరు, భారత్ టుడే టి.వి.ఛానల్ గురుంచిఇక్కడ ప్రస్తావించారు. 32:07 దగ్గర చూడండి.

 • పరిపూర్ణానంద స్వామి వారి పేరు, సురేంద్రబాబు గారి పేరు ఇక్కడ ప్రస్తావించారు. 1:27:49 దగ్గర చూడండి.

 • చిన్న జీయర్ స్వామి వారినికూడా ఇక్కడ ప్రస్తావించారు. 1:39:04 దగ్గర చూడండి.

చర్చకు కూర్చున్నారు, కాలయాపన చేశారు

 • తేదీ: 21 మే 2017.

 • అంతగా ప్రాముఖ్యం లేని విషయాలపై కాలయాపన చేశారు.

 • మతపరమైన అలజడులు కలిగించే వ్యక్తులుగా, వక్తలుగా కాక  అని ప్రస్తావించారు.

  అలజడులు ఎందుకు చేస్తారు? సగౌరవంగా ప్రశ్నలు అడిగినందుకా, లేక మీ దగ్గర సమాధానం లేనందుకా?

  అలజడులు ఎవరు చేస్తారు? కరుణాకర్ తో చర్చ జరపవద్దని మిమ్మల్ని బెదిరించి ముందుగా అనుకున్న చర్చను ఆపించిన మీ క్రైస్తవ సోదరులా?

 • బైబిల్ తెలుగు అనువాదంలో తప్పులు ఉన్నాయన్నారు. ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? బాధ్యత కలిగిన బైబిల్ బోధకుడిగా ఈ విషయాన్ని బైబిల్ సొసైటీ అఫ్ ఇండియా వారి దృష్టికి తీసుకెళ్ళేరా?  వారేమన్నారు?

 • చర్చ నియమాలు గుర్తు చేసి వత్తిడి చేస్తే గాని తరువాతి విషయంలోకి వెళ్ళలేదు.

 • నియమం ప్రకారం ఇంకొక గంటసేపు చర్చ జరగాలి, కానీ సమయం అయిపోయింది అని గంట ముందే హోటల్ వారు సభామండలి కాళీచేయమన్నారు.  అలా ఎందుకు జరిగిందో హోటల్లో చర్చ ఏర్పాటు చేసిన జాన్ రాజు గారికే తెలియాలి.

 

బైబిల్ బోధన ముసుగులో దశమభాగాల వసూలు, అమాయకులను బలవంతపు మతమార్పిడి చేయడం ద్వారా విదేశాలనుంచి వచ్చే లంచాలను జీవనాధారంగా చేసుకున్న ఈ వ్యాపారులకి విషయంపై చర్చ జరిపే ఉద్దేశం లేదనేది సుస్పష్టం. 2017 జులై 24 న విడుదల చేసిన లోకమెరుగని ఏసు మరోరూపం పుస్తకం పై ఈ దళారులు ఎలా స్పందిస్తారో చూద్దాం.