“క్రైస్తవుల దేవుడు పౌల్” అనే పుస్తకం నేను రాస్తానని, గత సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించాను.
ఈ ఆలోచన నా మదిలోనే నిక్షిప్తం అయిపోయింది.
చాలావరకు అందరూ మర్చిపోయారు కూడా.
కారణం నేనే. సమయాభావం వలన, పని ఒత్తిడి వలన, ఉద్యోగ భాగం లో వేరే రాష్ట్రంనకు వెళ్లడం వలన ఇలా పలురకాల కారణాలతో ఈ పుస్తకం వాయిదా వేస్తూ వచ్చాను.
కరుణాకర్ రాసిన రెండు పుస్తకాలు, 1. యహోవా మీద, 2. యేసు మీద ఉన్నాయి. రెండవ పుస్తకం లో పౌల్ గురుంచి కొంత వివరణ ఉంది.
అయితే పౌల్ గురుంచి మరింత వివరణ ఇవ్వాలి అనుకున్నాను కారణం అసలు ఈ రోజు క్రైస్తవం ఉన్నది పౌల్ వేసిన పునాదుల మీద కనుక.
ఈ రోజు యావత్తు క్రైస్తవం నమ్ముతున్న ముఖ్య నమ్మకాలు పౌల్ ప్రవేశపెట్టినవే. అటువంటి పౌల్ గురుంచి వివరంగా చెప్పాలి అనిపించింది.
ఈ విషయం సురేంద్రబాబు గారితో చెప్పాను. “మంచిది” అన్నారు. మన కరుణాకర్ తో చెప్పాను,
“రాయు” అన్నాడు.
ఆ తర్వాత మాటల సందర్భంలో ఈ విషయం ఎస్తర్ గారితో ప్రస్తావించడం జరిగింది. ఆవిడ బైబుల్ చరిత్ర పై రిసెర్చ్ చేస్తున్నారు అని మనకందరికీ తెలుసు.
“పౌల్ గురుంచి హిస్టరీ లో నాకేమీ దొరకలేదు, మీరు రాస్తే చాలా మంచిది అయితే బైబుల్ లో పౌల్ గురించి ఉన్న సమాచారం తో పాటు హిస్టరీ కూడా పరిశోధించి రాస్తే బావుంటుంది” అని సలహా ఇచ్చారు.
అప్పటి వరకు బైబుల్ లో ఉన్న పౌల్ గురుంచి మాత్రమే రాద్దాము అనుకున్న నేను హిస్టరీ కూడా యాడ్ చేద్దామా అనే సందిగ్ధం లో పడ్డాను.
అప్పటినుండి పౌల్ పై దొరికిన పుస్తకాలనన్నింటిని చదవడం మొదలు పెట్టాను. దానివలన మరికాస్తా సమయం పట్టింది. అయితే పుస్తకం ఎలా ప్రెజెంట్ చేయాలి అనే విషయం లో నాకు ఇంకా స్పష్టత రాలేదు.
మొత్తానికి ఎలా అయినా సరే పుస్తకాన్ని పూర్తి చేసి మీ ముందుకు తీసుకురావాలి అని కృత నిశ్చయంతో ఉన్నాను. ఇక ఆ పని తిరిగి మొదలు పెట్టబోతున్నాను.
అతి త్వరలో పుస్తకాన్ని మీ ముందు ఉంచబోతున్నాను.
ఇట్లు,
మీ,
భాస్కర్ కిల్లి.