బైబుల్ పై శివ శక్తి అడిగే ప్రశ్నలు చూసి ప్రతీవాడూ హిందూ గ్రంధాల గురుంచి ప్రశ్నలు వేస్తున్నారు.వారికి నేను అడిగే ప్రశ్న ఒక్కటే ..ఎప్పుడైనా మీ దేవుని పై మీ గ్రంధం పై మీరు ప్రశ్నలు వేసారా??ఆమ్మో ..దేవునికి వ్యతిరేకం గా వెళ్లడమే??వెళితే నరకం లో కాల్చేయడు?? అని భయపడే మీరు ఇతరుల గ్రంధాలను,దేవుళ్లను ప్రశ్నించే నైతిక హక్కు మీకెక్కడిది??

భారతీయ సాంప్రదాయం లోనే ప్రశ్నించే తత్వం ఉంది.సంశయింపక అగీకరింపకు అనే భావం ఉన్న గొప్ప సాంప్రదాయం మన భారతీయులదే.అందుకే ఆ కాలం లోనే మన వేదాలకు,ఉపనిషత్తులకు అర్ధాన్ని తర్కబద్ధం గా వివరిస్తూ ఆనాటి వారు గ్రంధాలు రాశారు.వాటినే “దర్శనాలు” అంటారు.భారతీయ సాహిత్యం లో దర్శనాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.హిందూ ధర్మానికి సంభందించి మొత్తం ఆరు దర్శనాలు ఉన్నాయి.

ఆఖరికి మన దేశం లో పుట్టిన నాస్తిక మతాలైన బౌద్ధ ,జైన మతాల వారు కూడా తర్క బద్ధమైన దర్శనాలు వ్రాసారు.వీరు ఆస్తిక దర్శనాలను ఖండించారు.తర్వాత వచ్చినవారు మరలా ఈ నాస్తిక దర్శనాలను ఖండించారు.ఇలా అనేక ఖండన మండనలు జరిగాయి.

శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఇలా తర్కబద్ధం గా ఖండిస్తూ మోత్తం 72 అవైదిక మతాలను ఖండిచారని మనకు  తెలిసిందే. ప్రశ్నించడం మన రక్తం లోనే ఉంది.

అడవులలో ఉండే అనాగరికులు వారికి తెలిసిన ఆటవిక న్యాయాలను వ్రాస్తూ దానికి దేవుని పేరు పెట్టుకుని మా దేవుని నే నమ్మాలి అని నమ్మనివారిని చంపుకుంటూ పోయిన ఈ విదేశీ జాతికి జ్ఞానం అంటే ఏం తెలుసు??తమ పై వచ్చిన ప్రశ్నలను ఖండించే జ్ఞానం లేక ప్రశ్నించే వారిని చంపుకుంటూ పోయిన చరిత్ర వారిది.

భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పిన గెలీలియో ని చిత్ర హింసలు పెట్టారు ..పగలు రాత్రి దేవుడు ఏర్పరిచాడు కనుక వీధి దీపాలు వద్దని ఆ నాటి విదేశీ మత పెద్దలు వాదించారు.ఇదీ ప్రశ్నించే వారి మీద ఆ మతాలు చేసిన దౌర్జన్యం.తర్కం అంటే ఏమిటో తెలియని వీరా మనల్ని ప్రశ్నించేది??

అంతగా మీకు ప్రశ్నించాలి అనుకుంటే ..ముందు ఆ దర్సనాలు చదివి అర్ధం చేసుకుని వాటిని తర్క బద్ధం గా ఖండించండి. అంత జ్ఞానం మాకెక్కడిది అంటారా..మూసుకు కూర్చోండి.అంతకన్నా మీరు చేయగలిగింది ఏమీ లేదు.