#ధార్మిక_యువశక్తి మరియు

Shivashakthi – శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక

ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి 10 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు గుంటూరులోని ప్రసిద్ధ మరియు పురాతన ఐదు శివాలయాలను కలుపుతూ చేపట్టిన నగర సంకీర్తన మరియు జాగరణ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పరమేశ్వరునికి అభిషేకించిన రుద్రాక్షలను అందజేయడం జరిగింది. ప్రతి శివరాత్రి కి గుంటూరు పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాలలో జాగరణ ఉండే భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము.
హరహర మహాదేవ
శంభో శంకర