జై శ్రీరామ్
అందరికీ నమస్కారం🙏 23-12-2018 న ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం లోని పల్లె పాలెం గ్రామంలో బహిరంగ సభ రూపం లో శివశక్తి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం లో సుమారు 160 మంది అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములు, గోవింద స్వాములు, ప్రజలు పాల్గొనగా చాలా అద్భుతంగా జరిగిందని తెలియజేయుటకు సంతోషిస్తూ, గర్విస్తున్నాము కూడా. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎంతో ఓపిక తో, ఆసక్తిగా ఉపన్యాసకుల ప్రసంగాలు విన్న స్వాముల, ప్రజల ఆధ్యాత్మిక భక్తిని, ఆసక్తి ని ఖచ్చితంగా అందరూ మెచ్చుకోవలసిందే. హాజరైన ప్రతి ఒక్కరి లోనూ మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలన్న తపన, మతమార్పిడుల బారిన పడిన అమాయక హిందువుల గురించిన ఆవేదన స్పష్టం గా కనిపించింది. ఈ కార్యక్రమం లో
అన్య మతాల వల్ల హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల గురించి శ్రీ పి.కోటేశ్వరరావు గారు వివరించారు. ఆధ్యాత్మికత గురించి, హిందూ ఆచారాల గురించి, వాటి వెనుక దాగి ఉన్న శాస్ర్తీయ కారణాల గురించి శ్రీ ఈమని బలరాం గారు వివరించారు. హిందూ యువతుల పై ముస్లిం యువకుల కుట్ర పూరిత మోసాల గురించి, లవ్ జిహాద్ గురించి అంబాల కిషోర్ గారు వివరించారు. క్రైస్తవ మతం లో, బైబిల్లో ఉన్న అశ్లీలత, అసభ్యత గురించి, చట్ట పరిధిలో మతం మారిన వారి రిజర్వేషన్లు ఏవిధంగా తొలగించబడతాయో శ్రీ తిరుపాలు గారు వివరించారు. ధనార్జన కోసం క్రైస్తవ పాస్టర్లు చేస్తున్న మోసాలు, వారి ఆగడాలు, మత మార్పిడి ముఠాలు అనుసరిస్తున్న మార్గాల గురించి, భూటకపు స్వస్థత ల పేరుతో అమాయకులను మతం మారుస్తున్న వారి విధానాలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా శ్రీ సెడింబి ప్రసాద్ గారు వివరించారు. హిందూ పూర్వీకులు చెప్పిన, ప్రస్తుత హిందూ సమాజం మరచిన హిందూ సంప్రదాయ, సదాచారాల వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాలను, వాటి వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుంది అని శ్రీ గొల్లపోతు వెంకటేశ్వర్లు గారు వివరించారు.

ఈ కార్యక్రమం లో ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన మన జిల్లా అధ్యక్షులు శ్రీ చిక్కుల ఆంజనేయులు గారు, పామూరు నుంచి వచ్చిన శ్రీ పులివర్తి నారాయణ స్వామి గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమ ఏర్పాట్లను చాలా చక్కగా నిర్వహించిన పల్లె పాలెం శివశక్తి టీమ్ సభ్యులకు పేరు పేరునా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
తదుపరి సమావేశం జనవరి-2019 లో జరుగుతుందని తెలియ పరుస్తున్నాము.

పల్లె పాలెం గ్రామ శివశక్తి సభ్యులు:

జి. వెంకటేశ్వర్లు గారు
ఎన్. వెంకటేశ్వర్లు గారు
ఎస్. గౌరీ శంకర్ గారు
పి. కోటేశ్వరరావు గారు
పి. వెంకటేశ్వర్లు గారు
పి. శ్యామ సుందర రావు గారు
టి. వెంకట రావు గారు
సి.హెచ్. వెంకట రావు గారు
ఎస్. ఉగ్ర నరసింహ గారు
ఎన్. నాగరాజు గారు
జి. పరమేశ్వర రావు గారు
ఎస్. సుందరయ్య గారు
పి. మల్లికార్జున గారు

అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికీ
ధన్యవాదాలు 🙏

శివశక్తి టీమ్,
ప్రకాశం జిల్లా.

జై శ్రీరామ్
జై హింద్
జై శివశక్తి