శివశక్తి అంటే కరుణాకర్ ‘వన్ మ్యాన్ షో’ అనేవారి కోసం.. గత నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో శివశక్తి నిర్వహించిన కార్యక్రమాలు. 👉 జడ్చర్ల లో శబరిమల విషయం పై ర్యాలీ.. 👉 ప్రకాశం జిల్లా దర్శి లో ర్యాలీ, కేరళ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం.. 👉 కడపలో శబరిమల ఘటన కు నిరసనగా ర్యాలీ. 👉 మచిలీపట్నం లో శబరిమల విషయంపై ప్రజా అవగాహన కలిగిస్తూ బ్యానర్ల ఏర్పాటు. 👉 నిన్న విజయవాడ లో కృష్ణా జిల్లా శివశక్తి కమిటీ సమావేశం. శివశక్తి పుస్తకాలు చదివి క్రైస్తవాన్ని వదిలి హిందుత్వం లోకి వచ్చిన నాగేశ్వరరావు గారికి అభినందనలు తెలుపుట. 👉 నిన్న భాగ్యనగరంలో కమిటీ సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన. 👉 నిన్న కరీంనగర్ లో జరిగిన బ్రేకింగ్ ఇండియా బుక్ సెమినార్ లో పాల్గొని అక్కడ వేదిక పై శివశక్తి గురించి పరిచయ ప్రసంగం చేసి, వచ్చిన వారికి శివశక్తి పుస్తకాలు పంపిణీ చేసిన కరీంనగర్ శివశక్తి. పై కార్యక్రమాలన్నింటి వివరాలు నా ప్రొఫైల్, Kalyan Kumar Chatlapally మరియూ శివశక్తి హిందూ ఐక్యవేదిక పేజీ లలో ప్రచురితమయ్యాయి. ఇవి కాకుండా అన్నిప్రాంతాలలో స్థానికం గా జరిగే సమావేశాలు, కమిటీ ల నియామకాలు యధావిధి గా కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాలో 56 మండలాలలో కమిటీ ల నియామకం పూర్తయింది. ప్రకాశం జిల్లా లో కమిటీల నియామకం శరవేగంగా జరుగుతోంది. ఇక శివశక్తి భాగ్యనగర కేంద్ర కార్యాలయం నుంచి నిత్యం జరిగే పుస్తక పంపిణీ, సోషల్ మీడియా నిర్వహణ, వివిధ ప్రాంతాల ప్రతినిధుల సమన్వయం, కాల్స్ అటెండ్ చేయడం ఇత్యాది కార్యాలు నిరాటంకంగా నడుస్తున్నాయి. నేను రీసెర్చ్, వీడియో షూటింగ్స్, షార్ట్ ఫిలిం మేకింగ్ లో బిజీ గా ఉండటం వల్ల వీటిలో ఏ ఒక్క కార్యక్రమంలో భాగస్వామిని కాలేదు. కానీ ఏ ఒక్కటీ ఆగలేదు. నేను ప్రాణాలకు తెగించి ఒక పునాది వేశాను. దానిపై భవంతి ని నిర్మించడం లో అనేకమంది శ్రమించారు. ఇక నేను లేకపోయినా ఈ వ్యవస్థ నడుస్తుంది.. “నాయకుడు అవసరం లేని సమాజాన్ని నిర్మించేవాడే నిజమైన నాయకుడు” హరహర మహాదేవ్.. source:Karunakar Sugguna