మీలో ఎవరు స్వర్గానికి వెళ్తారు..
అనే వ్యాసానికి స్వాగతం, సుస్వాగతం…!!!
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ప్రపంచం లో ఉన్న 750 కోట్ల జనాభా లో ఎక్కువ శాతం మంది దేవుణ్ణి నమ్ముతారు, మనిషి చనిపోయాక స్వర్గానకో, నరకానికో వెళ్తారు అని నమ్ముతారు..!

ప్రపంచం లో ప్రధానంగా ఉన్న మతస్తులు అయిన క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువులు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఈ మూడు మతాలు కి చెందినవారే..

మనం పైన చెప్పినట్టు మనిషి మరణాంతరం అతనికి స్వర్గం నరకం వస్తుందని ఈ మూడు మత గ్రంధాలూ చెప్తున్నాయి..

అయితే హిందువుల గ్రంధాల ప్రకారం మనిషి స్వర్గము నరకము తో పాటు వాటికీ అతీతమైన మోక్షాన్ని పొందుతారని ఉంటుంది..

చాలా సులువైన భాషలో స్వర్గమ్ నరకమ్ మోక్షమంటే ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చెద్దాం..

స్వర్గమంటే మనిషి చనిపోయాక అతనికి సకల సౌకర్యాలు మరణాంతరం ఉంటాయి, నరకం అంటే మనకి అక్కడ శిక్షలు వేసి, అగ్నిలో వేసి కాలుస్తారు..

మోక్షమంటే మళ్లీ పుట్టాల్సిన అవసరం లేకుండ ఆ పరమాత్మలో కలిసిపోవడానికి మోక్షం అంటారు.

ఇస్లాం, క్రైస్తవం ప్రకారం మనిషి కి ఒకసారి పుడతాడు, ఒక్కసారి చనిపోతాడు.. కానీ హిందువుల నమ్మకం ప్రకారం.. మనిషి తాను, చేసుకున్న పాప పుణ్యాలు బట్టి స్వర్గం నరకం అనేవి అనుభవిస్తాడు అని.. చేసిన పాపం కి నరకం, చేసిన పుణ్యానికి స్వర్గం అనుభవిస్తాడు.. అవి పూర్తిగానే మళ్ళీ వేరే జన్మ (రకరకాల మానవ, జంతువుల) ఎత్తుతాడు.. ఇలా జన్మలు చక్రం లో తిరుగుతుంటాడు, ఇలా తిరుగుతున్నపుడు ఎప్పుడైతే మనం ఆ పరమాత్మని తెలుసుకుంటామో.. అప్పుడు మనకి మోక్షం వస్తుంది.. ఇక పుట్టాల్సిన పని లేదు..!!

************************

ఇప్పుడు మన అసలు విషయం అయిన “ఎవరు స్వర్గానికి వెళ్తాతారు అనేది” చూద్దాం.. మనలో ఎవరు స్వర్గానికి వెళ్తారు అనేది ఆయా మతాలు నమ్మకాలూ బట్టి చర్చిద్దాం..

ఇస్లాం మతం ప్రకారం ఎవరికీ స్వర్గం :-
=======================

ఇస్లాం మతం ప్రకారం ఎవరైతే అల్లాను పూజిస్తారో అలాగే మహమ్మద్ ప్రవక్తను చివరి ప్రవర్తగా నమ్ముతారో వారికి స్వర్గలోక ప్రవేశం,

ఖురాన్ ప్రకారం అల్లా కాకుండా వేరే దేవుళ్లను పూజిస్తే దాన్ని “షిర్క్” అంటారు, అల్లా దేనినైనా క్షమిస్తాడు గాని షిర్క్ ని మాత్రం క్షమించడు…

ఈ లెక్కన ప్రపంచ జనాభా లో ఉన్న కేవలం 160 కోట్ల మంది ముస్లిమ్స్ మాత్రమే స్వర్గానికి వెళ్తారు. మళ్లీ ఈ 160 కోట్లమంది లో సగం మంది ముస్లిమ్స్ అల్లా తో పాటు దర్గాలని, బాబాలని పూజిస్తారు సో వాళ్ళు స్వర్గానికి వెళ్ళే అవకాశమే లేదు…

ఫైనల్ గా ఇస్లాం ప్రకారం ప్రపంచ జనాభా 750 కోట్లలలో 80 కోట్ల మంది ముస్లిమ్స్ మాత్రమే స్వర్గానికి వెళ్లే అవకాశం కలిగిఉన్నారు.. క్రైస్తవులు, హిందూవులు, మిగతా మతస్తులు నరకానికే.. ఎందుకంటే వాళ్ళు అల్లా ని పూజించలేదు కాబట్టి..!!!

క్రైస్తవ మతం ప్రకారం ఎవరికి స్వర్గం :-
========================

క్రైస్తవ నమ్మకం పరిశీలిస్తే క్రైస్తవం లో ఎవరైతే వాళ్ల దేవున్ని పూజిస్తారో వాళ్ల దేవుడిని నమ్ముతారో వాళ్లకే స్వర్గం ఉంటుంది, నమ్మని వారికి నరకమే..!

(నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షించబడతాడు, లేదంటే శిక్షించబడతాడు)

క్రైస్తవుల దేవుడు ఎవరు అనేది, వాళ్లకి క్లారిటీ లేదు.. మేరీ మాత, యహోవా, యేసు ఇలా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు..!!

కానీ క్రైస్తవులు అందరకి కూడా నరకమే.. అని అనిపిస్తుంది నాకు.. ఎందుకంటే ??

క్రైస్తవుల్లో కాథలిక్స్ శాఖ అనే ఉంది వీరు అందరు విదేశాల్లో మేరీ ని, మన దేశము లో ఆరోగ్య మాత, గుణదాల మాత, వేలంగిణి మాత అని మేరీ విగ్రహాన్ని పూజిస్తారు.. బైబిల్ ప్రకారం విగ్రహాన్ని, కొత్త దేవతలని పూజిస్తే నరకమే కాబట్టి ఈ కేథలిక్స్ ప్రపంచము లో 120 కోట్ల మందికి ఉన్నారు, వీళ్ళందరికి 100% నరకం..!!

మిగత వాళ్ళు అయిన ప్రొటెస్టన్స్, ఆర్తోడాక్స్ లో దాదాపు 90% మంది కూడా యేసు విగ్రహాలు పూజిస్తారు కాబట్టి వాళ్లకు నరకమే.. దాదాపు 90% చర్చ్ లు, ఈ రకం క్రైస్తవులు ఇళ్ళలో యేసు ఫోటులు, మేడలో శిలువలు, ఉంటాయి.. సో వీళ్లకి కూడా నరకమే..!!

ఇంకో లెక్కలో ఇంకా మిగిలిన వాళ్లకి, అస్సలు మొత్తం క్రైస్తవులకు అందరికి నరకమే వస్తుంది ఎలా అంటే..

బైబిల్ లో ప్రకటన 22: 18, 19 ప్రకారం

ఎవడైతే బైబిల్ లో లేనివి పెట్టి లేనివి తీసివేస్తారో వాళ్లకి ఈ గ్రంధం లో ఉన్న తెగుళ్లు, పరిశుద్ధ పట్టణం లో వాళ్లకి చోటు లేకుండా చేస్తా.. అని ఉంటుంది, దీని అర్ధం బైబిల్ లో అక్షరం తీసివేసినా కలిపినా వాళ్ళ దేవుడు తాట తీస్తా, స్వర్గం లో నో ఎంట్రీ అంటున్నాడు..

ఈ లెక్కన క్రైస్తవ శాఖలు అయిన

కేథలిక్స్ చదివే బైబిల్ లో 73 బుక్స్ ఉంటాయి..
ప్రొటెస్టన్స్ చదివే బైబిల్ లో 66 బుక్స్ ఉంటాయి..
ఆర్తోడాక్స్ చదివే బైబిల్ లో 81 బుక్స్ ఉంటాయి..

వీళ్ళు అందరు క్రైస్తవులు కూడా బైబిల్ లో కొన్ని చాఫ్టర్స్ లేపేసి, కొన్ని చాప్తర్స్ ఆడ్ చేసి వీళ్లకి నచ్చినట్టు బైబుల్ చదువుతున్నారు.. సో ఇది యహోవా దృష్టిలో నేరమే కదా!!! దీని బట్టి అందరు క్రైస్తవులు కి నరకమే..!!

క్రైస్తవుల నమ్మకం ప్రకారం ప్రపంచం లో ఉన్న జనాభా 750 కోట్ల అంతా నరకానికి పోతారు, ఎలా అంటే
ముస్లిం, హిందువులు, మిగతా మతాలు వారు బైబుల్ దేవున్నీ కాకుండా వేరేదేవుళ్ళని, విగ్రహాలని పూజించారు కాబట్టి వీళ్లకి నరకము, అలాగే పైన చెప్పినట్టు క్రైస్తవులకు ఎలానో నరకమే.. సో ప్రపంచం లో ఉన్న జనాభా అందరికీ నరకమే..!!

హిందూ మతం ప్రకారం ఎవరికీ స్వర్గం :-
=========================

హిందూ మతం ప్రకారం స్వర్గము, నరకం అనేది మనం పూజించే దేవుడు బట్టి కాకుండా మనం చేసే కర్మలు (పనులు) బట్టి అందించబడుతుంది.

అంటే దీనర్థం మనం పాపం చేస్తే నరకమ్, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాము, హిందువుల నమ్మకం ప్రకారం మా దేవున్ని పూజిస్తే స్వర్గము, లేదంటే మీకు నరకము అని ఎవరూ అనరు, ఏ దేవుని ఎవరు పూజించుకున్న వాళ్లు మంచి పనులు చేస్తే చాలు, ఆ మంచి పనులకు వచ్చిన ఫలితం పుణ్యమే వారికి స్వర్గలోకప్రాప్తి కలిగిస్తుంది..

అందుకే ఎప్పుడు ఒక హిందువు మా దేవుని పుజించండి, మా దేవుణ్ణి మాత్రమే పూజించండి మీకు స్వర్గం వస్తుంది లేదంటే నరకమ్ వస్తుంది అని చెప్పడు

నీ నమ్మకం ప్రకారం నువ్వు అల్లా, యేసు, మేరీ,యహోవా, ఎవరినైనా పూజించు కానీ నువ్వు చేసే కర్మలు మాత్రం ముఖ్యం అవే నీకు స్వర్గం నరకం ఇస్తాయి..

అంటే ఏ మతస్తులు అయినా మంచి చేసినట్లయితే ఆ పని ద్వారా వచ్చిన పుణ్యము వాళ్లని స్వర్గానికి తీసుకెళ్తుంది, అలాగే ఏ మతస్థులైనా చెడుపని చేస్తే దానికి వచ్చిన పాపం ఫలితం వారిని నరకానికి తీసుకెళ్తుంది..

ఈ లెక్కన క్రైస్తవులు, ముస్లింలు, మిగతా మతస్థులుకి అందరూ కూడా వాళ్లు నమ్మిన దేవునిబట్టి కాకుండా వాళ్లు చేసిన పనిని బట్టి వాళ్ళకి స్వర్గమూ నరకమూ నిర్ణయించబడుతుంది… చివరికి వాళ్లు నాస్తికుడైనా దేవుని నమ్మని వాడు అయినా వాడు చేసిన పనిని బట్టే వాళ్లకి స్వర్గము, నరకం, మోక్షము అనేది నిర్ణంచబడుతుంది..

కాబట్టి కేవలం హిందూ మతం ప్రకారమ్ మాత్రమే
ప్రపంచం లో ఉన్న 750 కోట్ల మంది కూడా మతాలకి అతీతంగా స్వర్గానికి చేరుకునే ఆవకాశం కలిగిఉన్నారు..!

అందుచేత ప్రపంచం లో అందరు స్వర్గానికి వెళ్లాలంటే మీ దేవుళ్లను కాకుండా మీరు చేసే కర్మలు మీద జాగ్రత్త వహించండి..!!

ఇక్కడ వ్యాసం పెద్దది అవుతుంది కాబట్టి,
పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి
ఇంగ్లిష్ లో పాపము ని sin అంటాం, మరి పుణ్యం ని ఏమి అంటాం..!!
అసలు పుణ్యం అనే పదం విదేశాల్లో, విదేశీ మతాల్లో ఉందా?? అనే ప్రశ్నలకు ఈ లింక్ చుడండి..!!